RTV Interview: తుమ్మలతో అనుబంధం తెంచుకోలేను.. మళ్లీ గెలుస్తా: మెచ్చా నాగేశ్వరరావు ఇంటర్వ్యూ రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రని చేధిస్తూ అశ్వరావుపేట నుంచి మరోసారి విజయం సాధిస్తానని.. గులాబీ జెండాను రెపరెపలాడిస్తానని మెచ్చా నాగేశ్వరరావు చెబుతున్నారు. తుమ్మల పార్టీ మారినంత మాత్రాన ఆయనతో అనుబంధాన్ని తెంచుకోలేనని చెప్పారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. By Vijaya Nimma 16 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి నాలుగు దశాబ్ధాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూసినా.. ఆయన మచ్చలేని మెచ్చా నాగేశ్వరావుగా పేరు పొందారు. అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు నాలుగున్నర ఏళ్ల పాటు ఎంతో కృషి చేశారు. చెప్పిందే చేస్తాను.. చేసిందే చెప్తాను అంటున్నారు నాగేశ్వరరావు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రని చేధిస్తూ అశ్వరావుపేట నుంచి మరోసారి విజయం సాధిస్తానని.. గులాబీ జెండాను రెపరెపలాడిస్తానని మెచ్చా నాగేశ్వరరావు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: రెచ్చిపోయిన డీకే అరుణ.. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై షాకింగ్ కామెంట్స్ మూడోసారి సీఎం కేసీఆరే.. ఆర్టీవీకి తాజాగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.. ఆయన ఏమన్నారంటే.. సీఎం కేసీఆర్ చేసిన పాలన చూసి ప్రజలంతా ఆయన వైపు ఉన్నారన్నారు. తన రాజకీయ గురువు తుమ్మల అని.. ఆయనతో అనుబంధం మూడు దశాబ్దాలదని ఎమ్మెల్యే తెలిపారు. తుమ్మల పార్టీ మారారని అనుబంధాన్ని తెంచుకోలేనన్నారు. ఎమ్మెల్యేగా అశ్వారావుపేటకు ఎంతో చేశా.. రాబోయే ఎన్నికల్లో గులాబీజెండా ఎగురవేస్తాం అంటూ నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మూడోసారి కూడా సీఎం కేసీఆర్‌ను గెలిపిస్తారని మెచ్చా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. ప్రజలలో విపరీతమైన ఆదరణ ఉంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిచారు. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదని నాగేశ్వరరావు తెలిపారు. నేను చంద్రబాబుకు చెప్పే ప్రజల సేవ కోసం బీఆర్ఎస్లో చేరానని నాగేశ్వరరావు అన్నారు. నాపై ఏలాంటి రాజకీయ కుట్ర లేదు.. నా మంచి తనమే తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందన్నారు. నేను ఏంటో సీఎంకి, ప్రజలకు తెలుసన్నారు. ప్రజలలో తనకు విపరీతమైన ఆదరణ ఉందన్నారు. సీఎం కేసీఆర్ సపోర్ట్‌తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. ప్రజలకు వారి ఊరిలో ఏం కావాలన్న చేయడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు. మెచ్చా నాగేశ్వరరావు పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. ఇది కూడా చదవండి: ఏపీలో మరో దారుణం.. భార్యపై అనుమానంతో ఏం చేశాడంటే…? #ashwaraopet-mla #telangana-elections-2023 #exclusive-interview #mecha-nagevwara-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి