ఛానళ్లపై పరువు నష్టం దావా కేసు వేస్త: అషురెడ్డి తెలుగు చిత్రసీమను మత్తు పదార్థాల కేసు కుదిపేస్తోంది. జూన్ 13న నిర్మాత కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో బిగ్ బాస్ అషురెడ్డి, నటి జ్యోతి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు కొన్ని న్యూస్ ఛానళ్లు పేర్కొన్నాయి. కేపీ చౌదరి కేసులో అషురెడ్డి పేరు బలంగా వినిపించింది. కొన్ని మీడియా ఛానళ్ళు ఆమె నంబర్ బయటపెట్టారు. సదరు ఛానళ్లపై కేసు వేయడానికి అషురెడ్డి రెడీ అవుతున్నారు. By Vijaya Nimma 27 Jun 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి అషురెడ్డి ఫోన్ నంబర్ మీడియాలో.. ముఖ్యంగా న్యూస్ ఛానళ్లు అషురెడ్డి ఫోన్ నంబర్ బయటపెట్టింది. దాంతో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ నంబర్ బయటపెట్టిన ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. రెండు రోజులగా తీవ్రమైన మానసిక వేదన 2-3 రోజులుగా ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అందులో నా పేరు బయటకు వచ్చింది. అది పట్టుకుని చాలా న్యూస్ ఛానళ్లు ఓపెన్‌గా నా నంబర్ వేశారు. నా పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేయడం జరిగింది. ఆ కేసుకు, నాకు ఎంత సంబంధం ఉంది? అనేది నేనూ చెప్పగలను. నా దగ్గర కూడా కాల్ లిస్ట్, ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది అయితే వందల కొద్దీ ఫోన్ కాల్స్, గంటల కొద్దీ సంభాషణలని చెబుతున్నారో? అందులో నిజం లేదు. అది తప్పు అని ప్రూవ్ చేయడానికి నాకూ హక్కు ఉంది. ఇటువంటి సమయంలో నేను మౌనంగా ఉంటే మీ ఆరోపణలు ఒప్పుకొన్నట్టు ఉంది. ఎంత మౌనంగా ఉందామని అనుకున్నా.. ఈ రెండు రోజులు నేను తీవ్రమైన మానసిక వేదన అనుభవించా. నిజనిజాలు ఏమిటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కొన్ని ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయి. నోటికి వచ్చినట్లు మాట్లాడాయి. తప్పకుండా వాళ్ళ మీద పరువు నష్టం దావా కేసు వేస్తని అషురెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. కేసుకు ఎటువంటి సంబంధం లేదు తన ఫోన్ నంబర్ బయట పెట్టడంతో ప్రతి సెకన్ ఓ కాల్ వస్తుందని అషురెడ్డి చెప్పారు. అంతే కాదు ఫోన్ తీసి మిస్ కాల్స్ చూపించారు. గత 2-3 రోజులుగా అదే జరుగుతోందని ఆమె వాయిపోయారు. ఇక నుంచి ఆ నంబర్ ఉపయోగించానని పేర్కొన్నారు. కేపీ చౌదరి కేసు జరిగినప్పుడు తాను వేరే దేశంలో ఉన్నానని, తనకు కేసుకు ఎటువంటి సంబంధం లేదని అషురెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కేసుతో ఆమెకు సంబంధం ఉందంటూ వార్తలు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి