డిసెంబర్ 6 లాంటి ఘటనలు జరుగుతాయని మేము భయపడుతున్నాం... ఓవైసీ కీలక వ్యాఖ్యలు...!

వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు కాంప్లెక్స్ లో ఆర్కియాలాజికల్ సర్వే జరుగుతున్న సందర్భంలో ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఎస్ఐ సర్వే రిపోర్టు వస్తే బీజేపీ మళ్లీ ఓ కథను తెరపైకి తీసుకు వస్తుందన్నారు. అంతకు ముందు అలహాబాద్ హై కోర్టు ఆదేశాలకు ముందు యోగీ ఆదిత్య నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.

New Update

మళ్లీ ఏఎస్ఐ సర్వే బయటకు రాగానే మళ్లీ మరో కథను బీజేపీ తెరపైకి తెస్తుందన్నారు. డిసెంబర్ 23 లేదా డిసెంబర్ 6 లాంటి ఘటనలు జరుగుతాయని తాము భయపడుతున్నామని పేర్కొన్నారు. బాబ్రీ మసీదు లాంటి కేసులు మరిన్ని జరగాలని తాము కోరుకోవడం లేదన్నారు. జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ చేపట్టిన శాస్త్రీయ సర్వే రెండో రోజు కొనసాగింది.

ఈ సర్వేలో ముస్లిం వర్గానికి చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇంతే జామియా మసీదు కమిటీకి చెందిన అఖ్లాక్, ముంతాజ్ లు సర్వే బృందం వెంట వున్నారని మసీదు కమిటీ తరఫు న్యాయవాది తౌహీద్ ఖాన్ వెల్లడించారు. సర్వే శనివారం ఉదయం 5 గంటలకు ప్రారంభం అయిందని, ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది రాజేశ్ మిశ్రా పేర్కొన్నారు.

హిందూ వర్గం తరపు న్యాయవాది సుధీర్ త్రిపాఠి మాట్లాడుతూ.... విగ్రహాల శకలాలను శిథిలాల కింద గుర్తించినట్టు తెలిపారు. విగ్రహాలు కూడా శిథిలాల కింద బయటపడతాయని తాము ఆశిస్తన్నట్టు చెప్పారు. సర్వేకు ఇంతెజామియా మసీదు కమిటీ సహకరిస్తోందన్నారు. అంతకు ముందు ఇవ్వని తాళం చేవులు కూడా మసీదు కమిటీ సభ్యులు ఇచ్చారన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు