సీఐ స్వర్ణలత కేసులో తవ్వేకొద్దీ సరికొత్త ట్విస్ట్

విశాఖలో మోసం చేసి డబ్బు గుంజుకున్న కేసులో అరెస్ట్ అయిన ఆర్ఐ సీఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు వేశారు. కీలకపాత్ర పోషించిన ఆర్ఐ కానిస్టేబుల్ హేమసుందర్, హోమ్ గార్డ్ శ్రీనులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. స్వర్ణలత సహా ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులకు ఈనెల 21 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. A4 స్వర్ణలత ఇప్పటికే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

సీఐ స్వర్ణలత కేసులో తవ్వేకొద్దీ సరికొత్త ట్విస్ట్
New Update

As CI digs into the Swarnalata case new key facts emerge

విశాఖకు చెందిన మహిళా రిజర్వు ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత కేసులో తవ్వేకొద్దీ కొత్త కొత్త కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. నోట్ల మార్పిడి వ్యవహారంలో అడ్డంగా బుకైన ఏఆర్ఐ స్వర్ణలత అరెస్ట్ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆమె వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే పోలీసు డిపార్ట్‌మెంటే ముక్కున వేలు వేసుకుంటోంది. ఒంటిపై ఉన్న ఖాకీ డ్రెస్‌ను అడ్డం పెట్టుకొని బెదిరింపులు, డబ్బు వసూళ్లు, బ్లాక్ దందాలు..ఇవన్నీ స్విల్వర్ స్క్రీన్‌పై మెరిసిపోవాలన్న డ్రీమ్ కోసమే స్వర్ణలత చేసినట్టు విచారణలో బయటపడింది.

ఆరోపణలు వాస్తవమే

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డీసీపీ -1 విద్యాసాగర్ నాయుడు, క్రైమ్ డీసీపీ జి.నాగన్నలను ఆదేశించారు. విచారణలో ఆ ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో సీపీకి నివేదించారు. మరోవైపు రిటైర్డ్‌ నేవీ ఉద్యోగులను బెదిరించి లక్షలు కాజేసిన సిఐకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. నిందితులైపై చర్యలకు సిద్దమైన సమయంలో నగరానికి చెందిన ఒక వైసీపీ ప్రజాప్రతినిధి ఫోన్ చేసి. కేసు లేకుండా వదిలేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సినిమాలో మంచి పాత్ర

ఒక ప్రజాప్రతినిధి తాను తీయబోయే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని, ఇందుకోసం డ్యాన్స్ నేర్చుకోవాలని చెప్పటంతో ఒక కొరియోగ్రాఫర్‌ను నియమించుకుని ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన డ్యాన్సులకు సంబంధించిన వీడియోలను తీయించారు స్వర్ణలత. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలో స్వర్ణలతకు కొంతమంది వైసీపీ నేతలతో పరిచయాలు పెరిగాయి. గత జీవీఎంసీ ఎన్నికల్లో ఆమెకు బంధువైన ఓ మహిళా అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్నట్లుగా కూడా చాలా ఆరోపణలు వచ్చాయి.

సినిమా నిర్మాణం కోసం డబ్బులు

ప్రస్తుతం తాను నటిస్తున్న ఏపీ 31 సినిమా నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలోనూ స్వర్ణలత భాగస్వామి అయినట్లు సమాచారం. సినిమా నిర్మాణం కోసం డబ్బులు అవసరం పడడంతో నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా.. ? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అంతేకాదు.. స్వర్ణలతకు కొందరు రియల్టర్లతోనూ పరిచయాలున్నాయి. కమీషన్‌ తీసుకుని ఇలా నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కొన్ని ప్లాట్లు కూడా ఆమె బుక్‌ చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్వర్ణలత కేసు ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప్రకంపనలు రేపుతోంది.

స్వర్ణలతను అరెస్ట్ చేస్తారా?

ఈ ఘటనపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాధితులు నగదుతో వస్తున్నారనే సమాచారం లీక్ చేసి కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి దోపిడీలు చేసి ఉంటారని.. ఇప్పుడు బయటపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు స్వర్ణలతను అరెస్ట్ చేస్తారా లేకపోతే.. అలాంటి ఆఫీసర్లే తమ బలం అని వదిలేస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe