Parenting Tips: మీ పిల్లలు పెరుగుతున్నారా? తల్లిదండ్రుల కోసం ప్రత్యేక చిట్కాలు..!

పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల బాధ్యతలు కూడా పెరుగుతాయి. పిల్లలకు మంచి ఉదాహరణలు, సానుకూలంగా ఉండటం, పిల్లలతో మాట్లాడటం, పిల్లల మాట వినాలి, క్రమశిక్షణ ముఖ్యం వంటి కొన్ని సులభమైన చిట్కాలు ముఖ్యమైన సమయంలో తల్లిదండ్రుల మద్దతు, మార్గదర్శకత్వం చాలా ముఖ్యం.

New Update
Parenting Tips: మీ పిల్లలు పెరుగుతున్నారా? తల్లిదండ్రుల కోసం ప్రత్యేక చిట్కాలు..!

Parenting Tips: పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల బాధ్యతలు కూడా పెరుగుతాయి. పిల్లల ఈ ముఖ్యమైన సమయంలో తల్లిదండ్రుల మద్దతు, మార్గదర్శకత్వం చాలా ముఖ్యం. ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ బాధ్యతలను ఇలా నిర్వర్తించాలి..? పిల్లలపై పేరెంటింగ్ చిట్కాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మంచి ఉదాహరణలు:

పిల్లలు తల్లిదండ్రుల నుంచి చాలా నేర్చుకుంటారు. అందువల్ల మీరు మీ పిల్లలలో చూడాలనుకుంటున్నట్లుగా ఎల్లప్పుడూ ప్రవర్తించాలి.

పిల్లలతో మాట్లాడాలి:

పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడాలి. వారి రోజు గురించి వారిని అడగాలి, వారి భావాలను అర్థం చేసుకోవాలి, వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. దీనివల్ల మీరు పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తున్నారనే భావన వారిలో కలుగుతుంది.

పిల్లల మాట వినాలి:

పిల్లలు చెప్పేది వినడం మాత్రమే కాదు. వారి ఆలోచనలు, సమస్యలను జాగ్రత్తగా వినాలి. దీంతో పిల్లలు తమ భావాలను మీతో చెప్పేందుకు వెనుకాడరు.

క్రమశిక్షణ ముఖ్యం:

పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం చాలా ముఖ్యం. ఏది ఒప్పో ఏది తప్పుదో వారికి చెప్పాలి. కానీ వారిని శిక్షించే బదులు, వివరించడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు.

సానుకూలంగా ఉండాలి:

పిల్లల ముందు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండాలి. వారి చిన్న విజయాలను మెచ్చుకోని, ప్రోత్సహించాలి. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

సమయం ఇవ్వాలి:

పిల్లలతో సమయం గడపడం చాలా ముఖ్యం. వారితో ఆడుకోండి, కథలు చదివిచడం, కుటుంబ కార్యకలాపాలలో పాల్గొనండం వంటి చేయాలి. దీనివల్ల పిల్లలు మీకు ముఖ్యమని భావిస్తారు.

Also Read: రాత్రిపూట మీ బీపీ అదుపులో ఉండాలంటే ఇలా చేయండి!

Advertisment
తాజా కథనాలు