Kejriwal: నేను చనిపోతే.. దయచేసి ఇలా ఎవరూ చేయవద్దు.. కేజ్రీవాల్ ఎమోషనల్ కామెంట్స్.! జూన్ 2వ తేదీన ఈడీ ఎదుట తాను సరెండర్ అవుతానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఒకవేళ దేశం కోసం తాను చనిపోతే..ఎవరూ బాధపడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 రోజుల పాటు జైల్‌లో ఉండడం వల్ల తన ఆరోగ్యం క్షీణించిందన్నారు. By Jyoshna Sappogula 31 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kejriwal: జూన్ 2 మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసిపోతుంది. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. జూన్ 2వ తేదీన ఈడీ ఎదుట తాను సరెండర్ అవుతానని తెలిపారు. ఒకవేళ తాను దేశం కోసం చనిపోతే..ఎవరూ బాధపడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 రోజుల పాటు జైల్‌లో ఉండడం వల్ల తన ఆరోగ్యం క్షీణించిందన్నారు. Also read: పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడ?.. కొనసాగుతున్న పోలీసుల వేట..! తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఢిల్లీ ప్రజల సంక్షేమాన్ని ఏ మాత్రం మర్చిపోనన్నారు. ఉచిత విద్యుత్, వైద్యం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం లాంటి హామీలు నెరవేర్చకుండా ఉండనని పేర్కొన్నారు. మీతో తాను లేకపోయినా సరే అన్ని పనులూ జరుగుతాయని వీడియోలో వెల్లడించారు. #arvind-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి