Pinnelli : పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడ?.. కొనసాగుతున్న పోలీసుల వేట..! మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తమిళనాడులో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. పోలింగ్ నాడు ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నాడు. By Jyoshna Sappogula 31 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Pinnelli Ramakrishna Reddy Brothers : మాచర్ల (Macherla) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) సోదరుడు వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) కోసం పోలీసుల సెర్చింగ్ చేస్తున్నారు. ఆయన తమిళనాడు (Tamilnadu) లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ (Turaka Kishore) తో పాటు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి తమిళనాడులో తల దాచుకున్నట్లు తెలుస్తుంది. Also Read: బాలకృష్ణకు దండం.. అంజలి ట్విట్ వైరల్.. మీరు అలా చేసినందుకు..! పోలింగ్ నాడు ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అన్న రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌తో అజ్ఞాతం వీడారు. తమ్ముడు వెంకట్రామిరెడ్డి మాత్రం బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకోని పరిస్థితి కనిపిస్తుంది. #pinnelli-ramakrishna-reddy #macherla #turaka-kishore #venkatrami-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి