Election Results: నేడు రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60, సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటన్నింటికీ ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరిగింది. By V.J Reddy 02 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Election Results: ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 6 గంటలకు ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 స్థానాలు ఉండగా.. ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 133 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ముందుగా జూన్ 4న అన్ని రాష్ట్రాల ఫలితాలతో వెల్లడించించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించగా.. ఆ తరువాత ఎన్నికల ఫలితాలను రెండు రోజుల ముందు అంటే జూన్ 2న ఓట్ల లెక్కంపు చేసి ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమైంది. ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2తో ముగుస్తోంది. కాగా జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తే జూన్ 2న ప్రభుత్వం రద్దు అవుతుండడంతో ఆ రెండు రోజులు అక్కడ ప్రభుత్వం ఉండదు. ఈనేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. #election-results #arunachal-pradesh-and-sikkim-state-election-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి