Arshdeep Singh: జోహెన్నెస్ బర్గ్‌లో అర్షదీప్ సింగ్ జోర్దార్ బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. ఐదు వికెట్లు తీసి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌గా పేరున్న సఫారీ జట్టు వెన్ను విరిచిన ఈ యువ పేసర్ కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేలలో సౌతాఫ్రికా గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంతవరకూ ఏ పేస్ బౌలరూ ప్రొటిస్ గడ్డపై ఈ ఘనత సాధించలేకపోవడం విశేషం.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన పేసర్ అర్షదీప్ సింగ్ సఫారీ జట్టు పతనాన్ని శాసించాడు. అయితే, వన్డేలలో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా గడ్డపై ఏ పేస్ బౌలరూ ఈ రికార్డు సాధించలేకపోయారు. గతంలో కొందరు ఆ మైలురాయిని చేరుకున్నప్పటికీ, ఆ ఐదు వికెట్ల ఘనత సాధించిన వారంతా స్పిన్నర్లే కావడం గమనార్హం. అర్షదీప్ ఈ మ్యాచ్‌లో తన పది ఓవర్ల కోటాలో 37 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.
సౌతాఫ్రికాలో వన్డే మ్యాచ్ ఆడుతూ ఇప్పటివరకూ సునిల్ జోషి (1999లో 5/6), యుజ్వేంద్ర చాహల్ (2018లో 5/22) మాత్రమే ఐదు వికెట్ల ఘనత సాధించారు. అయితే ఈ ఘనత సాధించిన తొలి పేసర్ మాత్రం అర్షదీపే. రవీంద్ర జడేజా కూడా సౌతాఫ్రికాపై ఐదు వికెట్లు తీసినా ఆ ఫీట్ వరల్డ్ కప్‌లో కలకత్తాలో సాధించాడు.
ఇది కూడా చదవండి: 500 వికెట్ల క్లబ్లో నాథన్ లియోన్.. గతంలో ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా!
అంతకుముందు ఇషాంత్ శర్మ 2013లో సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు (4/40) సాధించాడు. అర్షదీప్ ఈ ఘనత సాధించేకన్నా ముందువరకూ పేసర్లకు సంబంధించి అదే అత్యుత్తమ రికార్డుగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఈ రికార్డు కూడా చెరిగిపోయింది. 8 ఓవర్లు బంతులు విసిరిన పేస్ బౌలర్ ఆవేశ్‌ఖాన్ 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు రాబట్టాడు. అందులోనూ మూడు మెయిడెన్ ఓవర్లుండడం విశేషం.