Tirumala tickets: నవంబర్ కోటా తిరుమల టికెట్లను విడుదల చేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ నెల షెడ్యూల్‌ను విడుదల చేసింది. శ్రీవారి ఆర్జీత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈనెల 22 నుంచి 25 వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పలు రకాల టికెట్లకు సంబంధించి సేవా టికెట్ల ఎలక్ట్రానిక్, డీప్ రిజిస్ట్రేషన్ కోటాను విడుదల చేయనున్నది. భక్తులు మరింత ప్రీతికరంగా సేవలందించేందుకు టీటీడీ ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది.

New Update
Tirumala tickets: నవంబర్ కోటా తిరుమల టికెట్లను విడుదల చేసిన టీటీడీ

షెడ్యూల్‌ ఇవే..

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేసింది. ఇందులో భాగంగా న‌వంబ‌ర్‌ నెల షెడ్యూల్‌ ప్రకారం అష్టదళపాదపద్మారాధన, సుప్రభాతం, తోమాల, అర్చన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం ఈనెల (ఆగ‌స్టు) 19 నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు డబ్బు చెల్లించి వాటిని బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతర వెబ్‌సైట్లలో నమ్మొదు చేసి మోస పోవద్దని టీటీడీ సూచించింది.

పెరుగుతున్న రద్దీ..

తిరుమలలో శ్రావణ రద్దీ మొదలైంది. దీంతో తిరుమలకి కాలి నడకలో భక్తుల భద్రతా చర్యలను టీటీడీ గట్టిగా తీసుకుంది. నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌ కోటాను ఎల్లుండి ( (మంగళవారం) టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులకు నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌ కోటాను శనివారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. శ్రీవారి దర్శనం, వసతి, అంగప్రదక్షిణంకి సంబంధించిన టికెట్లను ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను నవంబర్ నెల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. ఇక శ్రీవారి దర్శనం వర్చువల్‌ ( ఆన్‌లైన్ సేవ)ల టికెట్లు విడుదలకానున్నాయి. నవంబర్‌లో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్ల కోటాను ఎల్లుండి ( మంగళవారం) మ.3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్‌లో అంగప్రదక్షిణం టికెట్లు కూడా ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులందరూ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

పండ్లు, కూర‌గాయ‌లు విక్ర‌యించ‌వద్దు

కొన్నిరోజులుగా నడ‌క దారిల్లో క్రూర‌మృగాల (చిరుత, ఎలుగు బంటి, ఏనుగులు) క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. అలిపిరి న‌డ‌క మార్గంలో వందకు పైగా తినుబండారాలు విక్ర‌యించే దుకాణాలు ఉన్నాయ‌ని, వీటిలో ఇక‌పై పండ్లు, కూర‌గాయ‌లు విక్ర‌యించ‌రాద‌ని.. భ‌క్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువుల‌కు తినిపించ‌డం వ‌ల్ల వాటి రాక పెరుగుతోంద‌ని ఎస్టేట్, పోలీసు, అటవీ, ఆరోగ్య శాఖ అధికారులతోపాటు దుకాణాల నిర్వాహ‌కుల‌తో ప‌లు అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ జంతువులు అటువైపు వ‌చ్చి భ‌క్తుల‌పై దాడి చేస్తున్నాయ‌ని టీటీడీ ఈవో తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు