గోదావరిలో కార్తీక స్నానాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు! కార్తీక మాస పుణ్య స్నానాల కోసం రాజమండ్రి కోటిలింగాల ఘాట్ కు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.ఈ క్రమంలో అధికారులు భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు.ఈ ఏర్పాట్లను ఎంపీ మార్గాని భరత్ పరిశీలించారు. By Bhavana 13 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి దీపావళి అయిపోయింది. కార్తీక మాసం వచ్చేసింది. ఇక ఏ నది చూసిన కార్తీక స్నానాలు చేసే వారితో కళకళలాడుతుంటాయి. ఈ క్రమంలోనే దక్షిణ కాశీగా పేరుపొందిన రాజమండ్రిలోని గోదావరి ఒడ్డున కార్తీక స్నానాలు చేసేందుకు వేలాదిగా భక్తులు తరలిస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం, స్నానాలు ఆచరించడానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఈ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. గోదావరి నది చెంతన ఉన్న కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్ తదితర ఘాట్లను ఎంపీ సందర్శించి పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అతి పెద్ద ఘాట్ కోటిలింగాల ఘాట్ అని పేర్కొన్నారు. ఈ ఘాట్ లో కార్తీక పుణ్య స్నానాలు చేసేందుకు రాష్ట్ర నలుమూలలనుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారని చెప్పారు. ఇక ఇక్కడే ఉమా కోటిలింగేశ్వర ఆలయం కూడా ఉండడంతో ఘాట్ లో భక్తులు స్నానాలు ఆచరించడంతో పాటు స్వామి వారిని కూడా దర్శించుకుంటారని ఆయన అన్నారు. ఈ ఘాట్ తో పాటు ఆలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ పాలక మండలి ఛైర్మన్ అరిగెల బాబు ఎంతో శ్రద్దతో పూర్తి చేశారని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.చిన్న పిల్లలు, వృద్దులు ఇబ్బందులు పడకుండా వారికి గోదావరి నది గట్టు పై ప్రత్యేక ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ముందు జాగ్రత్త చర్యలుగా రోప్స్ కట్టడంతో పాటు రెండు ప్రత్యేక బోట్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఎంపీ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచే భక్తులు నది తీరానికి వచ్చే అవకాశాలుండడంతో ఫ్లడ్ లైట్లు, ఆర్టిఫిషియల్ షవర్స్ స్టార్ట్ అవుతాయన్నారు. తెల్లవార్లూ లైట్లు వెలుగుతూనే ఉంటాయన్నారు. Also read: మీ ఒంట్లో షుగర్ లెవల్స్ తగ్గించుకోవడానికి ఈ ఒక్క కూరగాయ చాలు! #rajamundry #mp-bharat #karthikamasam #kotilingala-ghat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి