హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాన్ తన గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఆర్మీ సెంటర్ లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన జవాన్ పంజాబ్ కి చెందిన రాజేందర్ సింగ్ (40) గా గుర్తించారు.
బుధవారం తెల్లవారుజామున జవాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటన గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జవాన్ ఆత్మహత్య చేసుకున్న విషయం గురించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
కొద్ది రోజుల క్రితం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఏఎస్‌ఐ ఫజల్ మంత్రి వద్ద ఎస్కార్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఆయన తన కూతురు ముందే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కూతురు పెళ్లి కోసం నగదు సమకూరకపోవడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. సెక్యూరిటీ ఆఫీసర్ మృతదేహన్ని పరిశీలించిన మంత్రి సబితా నగదు విషయం తనను అడిగితే నేను సాయం చేసేద్దాన్ని అని వాపోయారు.
Also read: కోడి కత్తి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా!