Army dog: సైనికుడిని కాపాడేందుకు తన ప్రాణాలు వదిలిన ఆర్మీ డాగ్!

ఎన్నో సంవత్సరాలుగా సైన్యానికి సేవలు అందిస్తున్న ఓ ఆర్మీ డాగ్ కూడా తన ప్రాణాలను విడిచింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Army dog: సైనికుడిని కాపాడేందుకు తన ప్రాణాలు వదిలిన ఆర్మీ డాగ్!
New Update

జమ్ము కశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. మంగళవారం ఉగ్రవాదులను హతమార్చే క్రమంలో ఓ సైనికుడు వీరమరణం పొందగా..ఎన్నో సంవత్సరాలుగా సైన్యానికి సేవలు అందిస్తున్న ఓ ఆర్మీ డాగ్ కూడా తన ప్రాణాలను విడిచింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

సైనికాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజౌరీ జిల్లాలో నక్కి ఉన్న ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు ఆపరేషన్ సుజలిగల పేరుతో సైనిక దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆపరేషన్‌ సుజలిగల సైనిక దళంలో కెంట్ అనే జాగిలం కూడా ఉంది. ఈ దళాన్ని ఆ డాగ్ నే ముందుండి నడిపించింది అని చెప్పవచ్చు కూడా.

కెంట్ లాబ్రడార్ జాతికి చెందిన ఆడ శునకం. వయసు ఆరేళ్లు. కెంట్ కు ట్వంటీ వర్‌ ఆర్మీ డాగ్ యూనిట్ లో సైన్యం టైనింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులను వేటాడటంలో కెంట్ ముందుకు నడిచింది. ఆ సమయంలో సైన్యానికి ఎదురుపడిన ఓ ఉగ్రవాది కెంట్ ను పట్టుకున్న సైనికుడి మీద కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో కెంట్ ఒక్కసారిగా ఆ సైనికుడికి అడ్డుగా నిలిచింది. దీంతో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో కెంట్‌ నేలకొరిగింది. జిల్లాలో మంగళవారం నుంచి ఉగ్రవాదులకు సైనికులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సైన్యం ఓ ముష్కరుడిని హతమార్చింది. ఈ కాల్పుల్లో ఓ సైనికుడు కూడా చనిపోయాడు. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది.

#army #kenty #dog
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి