Nalgonda: హెలికాఫ్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం.. పొలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

TG: వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు వచ్చిన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గమనించిన పైలెట్ హెలికాఫ్టర్‌ను నల్గొండ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. సహాయక చర్యలు ముగియడంతో తిరిగి వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ తెలిపాడు.

New Update
Nalgonda: హెలికాఫ్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం.. పొలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Nalgonda: నల్లగొండ జిల్లాలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విజయవాడలో సహాయక చర్యల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం గమనించి అప్రమత్తమైన పైలట్ చిట్యాల పట్టణ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశాడు. వారం క్రితం జైపూర్‌ నుంచి విజయవాడకు ఆర్మీ హెలికాప్టర్‌ వచ్చింది. సహాయక చర్యలు ముగియడంతో తిరిగి వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. కాగా పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

ఇప్పటి వరకు 32 మంది..

ఏపీలో కురుస్తున్న వర్షాలకు, వరదలకు ఇప్పటివరకు 32 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కేవలం ఒక విజయవాడలోనే ఇప్పటివరకు 24 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ వరదల దాటికి 4,23,426 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 48,633 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. 4,050 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వరదలతో 59 వేల కోళ్లు, 275 పశువులు మృతి చెందాయి. 214 పునరావస శిబిరాలు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

Advertisment
తాజా కథనాలు