మలబద్ధకంతో బాధపడుతున్నారా.. అయితే ఇది తీసుకోండి.. నేటి కాలంలో మలబద్ధకం అనేది సాధారణ సమస్య. చాలా కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. దీని వల్ల చాలా మంది సమస్యని బయటికి చెప్పుకోలేరు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చిన్న, పెద్దవారిలో కూడా ఈ సమస్య వస్తుంది. దీనికి కారణాలు ఏంటి? ఆముదంతో ఎలా చెక్ పెట్టొచ్చో తెలుసుకోండి. By Durga Rao 27 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Constipation Treatment: మలబద్ధకం ఉంటే ఏ పని తోచదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ఆముదాన్ని ఎలా వాడాలో తెలుసుకోండి.మలబద్ధకానికి చాలా కారణాలు ఉన్నాయి.డైట్ ఫాలో అవ్వకపోవడం,తగినంత నీరు తాగకపోవడం,పోషకాల లోపం,ఒత్తిడి లాంటి చాలా కారణాలు ఉన్నాయి.నీరు తాకపోయినా , హైడ్రేషన్ తక్కువగా ఉన్నా, పీచుపదార్థాలు తీసుకోకపోయినా ఈ సమస్య వస్తుంది. వర్కౌట్ చేయకపోవడం మరో కారణం. ఈ సమస్య వస్తే మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. లక్షణాలు కనిపించిన వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. వర్కౌట్స్ చేయాలి. ప్రోబయోటిక్స్, మెగ్నీషియం, ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. పండ్లు, టమాటలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆకుకూరలు, పెరుగు వంటివి తసీుకోవాలి. ఈ సమస్య ఉన్నవారు చాక్లెట్స్ మానేయాలి.ఆకుకూరలు, బీన్స్, నట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. హోల్ గ్రెయిన్స్, చేపలు, టర్కీ, తేనె, ఫిగ్స్, బాదం, అవిసెలు, అవకాడో, ఆకుకూరలు తినాలి. ఎండుద్రాక్ష నీరు, క్యారెట్ రసం, పైనాపిల్ రసం తీసుకోవచ్చు. Also Read: మీ కాలివేళ్ల మధ్య సందులు ఉన్నాయా..అయితే మీరు అదృష్టవంతులు! ఆముదం తీసుకోవడం వల్ల మలబద్ధకానికి చెక్ పెట్టొచ్చు. కాబట్టి, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని ఈ నూనెని తీసుకుంటే సమస్య తగ్గుతుంది. ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుంది. ఆముదంలో రిసిలోనిక్ యాసిడ్ జీర్ణక్రియని మెరుగ్గా చేసి పోషకాలను గ్రహించేందుకు హెల్ప్ చేస్తుంది.నాభి చుట్టూ పొత్తికడుపుపై రాయడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఆముదం కండరాల సంకోచాన్ని పెంచి ప్రేగు కదలికల్ని ఈజీగా చేస్తుంది.ఓ కప్పు ఆరెంజ్ జ్యూస్‌లో ఆముదం, కొద్దిగా నిమ్మరసం కలపండి. దీనిని రెగ్యులర్‌గా తాగండి. ఈ మిశ్రమంలోని ఫైబర్ ప్రేగు కదలికల్ని ఈజీ చేస్తుంది. నిమ్మరసం, ఆముదం రెండింటి కలయిక కూడా సమస్యని తగ్గిస్తుంది. ఓ కప్పు నిమ్మరసంలో ఓ టేబుల్ స్పూన్ ఆముదం వేసి కలపాలి. నిమ్మలోని ఆమ్లగుణాలు ప్రేగుకదలికల్ని ఈజీగా చేస్తాయి. ఆముదం మలబద్ధకాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఓ కప్పు పాలలో టేబుల్ స్పూన్ ఆముదం కలపండి. దీనిని కలిపి తాగండి. ఇవన్నీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పరిష్కారాలు. దీనిని గర్భిణీలు, వాంతులు, రక్తస్రావం, అలర్జీలతో బాధపడేవారు తీసుకోవద్దు. #best-health-tips #constipation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి