Weight:పెళ్లి తర్వాత బరువు పెరుగుతున్నారా..ఇలా చేయండి పెళ్లైన తర్వాత కొందరు ఆడవాళ్లు వేగంగా బరువు పెరుగుతూ ఉంటారు. కొత్త ఇంట్లో ఆహారపు అలవాట్లు దీనికి కారణం కావచ్చు. కానీ పెరుగుతున్న బరువును నియంత్రించడానికి ప్రయత్నించకపోతే అనేక వ్యాధుల బారిన పడతారని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 03 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Weight: పెళ్లి తేదీ ఫిక్స్ అయిందంటే చాలు వెంటనే స్లిమ్‌గా కనిపించడం కోసం బరువు తగ్గేందుకు కసరత్తులు మొదలుపెడతారు. డైటింగ్, వ్యాయామాలు చేసి అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే అమ్మాయిలు పెళ్లి తర్వాత ఒక్కసారిగా మళ్లీ బరువు పెరుగుతారు. ఇలా ఎందుకు జరుగుతోందని ఎప్పుడైనా ఆలోచించారా..?.. వీటికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే.. కొత్త ఇంట్లో ఆహారపు అలవాట్లే ఇందుకు ప్రధాన కారణమని తేలింది. తిన్న తర్వాత గ్యాప్ లేకుండా మళ్లీ తినడం, ఉదయాన్నే లేచి భోజనం చేయడం, మిగిలిపోయిన ఆహార పదార్థాలను తినడం వల్ల బరువు తొందరగా పెరుగుతున్నారు. ఇలా బరువు పెరగడం వల్ల మీ శరీర ఆకృతి పాడవడమేకాకుండా అనేక రోగాల బారినపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. పెళ్లైన తర్వాత బరువును అదుపులో ఉంచుకునే చిట్కాల గురించి తెలుసుకుందాం. 1. సమయానికి ఆహారం తినండి పెళ్లి తర్వాత బరువు పెరగకూడదనుకుంటే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇందులో ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ సమయాన్ని ఫిక్స్ చేయండి . ఉదయం 8 గంటలకు అల్పాహారం ముగించి, నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు రాత్రి భోజనం ముగించండి. మీరు మీ సౌలభ్యం ప్రకారం భోజన సమయాన్ని ఒకేలా ఉండేలా ఎంచుకోండి. 2. మిగిలిపోయిన వాటిని తినే అలవాటు మానేయండి ఈ అలవాటు వల్ల కూడా బరువు వేగంగా పెరుగుతుంది. ఆహారం వృధా కాకుండా చూసేందుకు మహిళలు మిగిలిన ఆహారాన్ని తింటూ ఉంటారు. అవసరమైన ఆహారం కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొవ్వు బాగా పెరిగి బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. 3. ఒత్తిడికి దూరంగా ఉండండి..తగిన నిద్రపోవాలి పెళ్లయిన తర్వాత జీవితంలో చాలా మార్పులు వస్తాయి. సర్దుకుపోవడానికి బదులు ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి కూడా మన ఆరోగ్యానికి పెద్ద శత్రువు. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే నిద్ర విషయంలో రాజీ పడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: షిలాజిత్‌తో స్త్రీలలో కూడా ఆ శక్తి పెరుగుతుందా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి