Garlic Health Benefits: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!!

మనం నిత్యం ఉపయోగించుకునే వాటిల్లో వెల్లుల్లి ఒకటి. మనం వండే వంటకాల్లో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తూంటాం. వెల్లుల్లితో ఎన్నో అనారోగ్య సమస్యలు, వ్యాధులకు, రోగాలకు చెక్ పెట్టవచ్చు. అంత శక్తి వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లిని ఏ రూపంలో మనం తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

Garlic Health Benefits: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!!
New Update

Garlic Health Benefits: మనం నిత్యం ఉపయోగించుకునే వాటిల్లో వెల్లుల్లి ఒకటి. మనం వండే వంటకాల్లో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తూంటాం. వెల్లుల్లితో ఎన్నో అనారోగ్య సమస్యలు, వ్యాధులకు, రోగాలకు చెక్ పెట్టవచ్చు. అంత శక్తి వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లిని ఏ రూపంలో మనం తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా.

-ప్రతిరోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకుంటే గుండెకు మంచింది. గుండెకు రక్త ప్రసరణ సమృద్ధిగా జరుగుతుంది

-శరీరంలో రక్తం గడ్డకుండా ఉండేందుకు.. వెల్లుల్లిలోని యాంటీ క్లాటింగ్ గుణాలు తోడ్పడతాయి. ఫ్రీ రాడికల్స్ కూడా తొలగుతాయి.

-పరగడుపునే వెల్లుల్లిని తింటే.. లివర్, మూత్రాశయం పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు కాలేయాన్ని కూడా క్లీన్ చేస్తుంది.

-ముఖ్యంగా డయేరియా ఉన్నవారికి వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తింటే త్వరగా దాని నుంచి ఉపశమనం పొందవచ్చు.

-పేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. నాడీ వ్యవస్థను సైతం మెరుగు పరుస్తుంది.

-ఆకలి లేని వారికి ఆకలిని ప్రేరేపించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

-వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.

-ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండు తిని, మంచినీరు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు తగ్గుతాయి. అలాగే శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది.

-చెడుకొలెస్ట్రాల్ (LDL-C)ను తగ్గించడంతో పాటు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.

-హ్యూమన్ 3, హైడ్రాక్సీ-3, మిథైల్ గ్లుటరిల్ కో ఎంజైమ్ -ఎ (HMG-CoA), స్క్వాలీన్ మోనో ఆక్సిజనేస్ వంటివి కొలెస్ట్రాల్ ను నివారించడంలో సహాయపడుతాయి.

#so-manay-health-benefits-of-garlic #health-benefits #garlic #garlic-health-benefits #amazing-health-benefits-of-garlic
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి