Relationship: మీ లవర్‌ మిమ్మల్ని మోసం చేసినట్టు కలలు వస్తున్నాయా? కారణమేంటో తెలుసా?

కలలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటి అర్థాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మనం అయోమయానికి గురవుతాం. మీ లవర్‌ మిమ్మల్ని మోసం చేసినట్టు కల వస్తే అది మీలో పేరుకుపోయిన అభద్రత భావం వల్ల కావొచ్చు.. లేకపోతే ఓవర్ థింకింగ్‌, తీరని కోరికల వల్ల కూడా కావొచ్చు!

Relationship: మీ లవర్‌ మిమ్మల్ని మోసం చేసినట్టు కలలు వస్తున్నాయా? కారణమేంటో తెలుసా?
New Update

Cheating dreams meaning: కలలు చాలా వింతగా ఉంటాయి. కలలో మనకి కనిపించే ప్రాంతాలు, మనుషులను కొన్ని సార్లు ఎక్కడా చూసి ఉండము. అయితే ప్రతి కలకు ఒక అర్థం ఉందంటారు నిపుణులు. ఇక బాయ్‌ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గురించి వచ్చే కలలు మన ఆలోచనలకు తగ్గట్టుగానే ఉంటాయంటారు. మీ లవర్‌ మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు కలలు కంటుంటే అవి వాస్తవికతకు ప్రత్యక్ష ప్రతిబింబాలు కావని మీరు అర్థం చేసుకోవాలి. నిజానికి అవి ఒక విధంగా మనం అనుభవించే భావోద్వేగాలు, అనుభవాలకు, ఆలోచించే విధానాలకు ముడి పడి ఉంటాయి. మీ లవర్‌ మిమ్మల్ని మోసం చేసినట్టు కలవస్తే అందుకు అనేక కారణాలున్నాయి.

అభద్రత, నమ్మకం లేకపోవడం:

మీకు మీ లవర్‌ నమ్మకద్రోహం చేసినట్టు కల వస్తుందా? అయితే అది మీ అభద్రత వల్లే. మీ లవర్‌ మీకు దూరం అవుతుందేమోనన్న భయాల కారణంగానే ఇలాంటివి రావొచ్చు. అయితేకానీ నమ్మకద్రోహం చేస్తునట్టు అర్థం కాదు. అనిశ్చితి భావాలతో పోరాడుతున్నారని మీ కల కచ్చితంగా చెబుతుంది.

వ్యక్తిగత ఆందోళనలు..
మీపై మీకు నమ్మకం లేకపోతే మీ లవర్‌ మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుందన్న ఆందోళన మొదలవుతుంది. మీ సొంత భయాలకు ఈ కలలే ప్రతిబింబం

కమ్యూనికేషన్ గ్యాప్‌:
కొన్నిసార్లు, కలలు మన మనస్సులకు పరిష్కారం అవ్వని సంఘర్షణలు లేదా సమస్యలను ప్రాసెస్ చేయడానికి ఒక మార్గంగా పనిచేస్తాయి. మీ సంబంధంలో కమ్యూనికేషన్ సమస్యలు లేదా అపార్థాలు ఉంటే, మీ భాగస్వామితో ఈ ఆందోళనలను పరిష్కరించాలని మీ కల అర్థం.

ఎక్కువగా ఆలోచించడం:

సినిమాలు, పుస్తకాలు లేదా సంభాషణలు లాంటి అంశాలు కూడా మన కలలను ప్రభావితం చేస్తాయి. మీరు ఇటీవల నమ్మకం లేకపోవడం గురించి కథలు చదవి ఉన్నా.. లేకపోతే ఇతరులు మాట్లాడుకునేవి ఎక్కువగా విని ఉన్నా.. అవి మీ రిలేషన్‌తో నేరుగా సంబంధం లేకుండా కూడా కలలు రావొచ్చు.

తీరని కోరికలు:

కలలు తీర్చని భావోద్వేగ అవసరాలు లేదా కోరికలను హైలైట్ చేస్తాయి. మీ రిలేషన్‌షిప్‌లో మీరు నిర్లక్ష్యం, లేదా మానసికంగా దూరంగా ఉన్నట్లు భావిస్తే.. మీ కల మీ మనస్సుకు ఈ భావాలను వ్యక్తీకరించడానికి ఒక మార్గం కావచ్చు.

కలలు తరచుగా సింబాలిజాన్ని ఉపయోగిస్తాయి. ఇక మీరు కొత్త ప్రేమ గురించి కలలుగన్నట్లయితే, మీ ఆనందాన్ని దూరం చేసే పరిస్థితులు లేదా వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోవాలని అర్థం. అయితే కలలు నిజాలు కావని తెలుసుకోవాలి.. మనం ఎక్కువగా ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే అవి మన కలలోకి రావచ్చు.. రాకపోవచ్చు. కలలో వచ్చింది కదా అని నిజం అని నమ్మేసి ఇతరులపై మీ భావాలను రుద్ద వద్దు.

ALSO READ:   ట్రోల్‌ చేసుడు తప్పు.. ఈ బుడతడి మాటలు వింటే రోహిత్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు మారిపోతారు భయ్యా!

#relationship-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe