Night Shifts: నైట్ షిప్ట్‌లు ఎక్కువగా చేసేవారు ఉదయం అల్పాహారాన్ని అస్సలు మిస్ చేయకూడదు. ప్రతిరోజు వ్యాయామం, పోషకాలు అధికంగా ఉండే గింజలు, పండ్లు, కూరగాయలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో ఎక్కువ ఆహారం తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ రోజుల్లో పని తీరు పూర్తిగా మారిపోయింది. మారుతున్న వర్కింగ్ కల్చర్ వల్ల నైట్ షిఫ్ట్‌లు జీవన విధానంలో భాగమైపోయాయి. ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే చాలా మంది ప్రజలు ఏదో ఒక రకమైన నిద్ర రుగ్మతతో బాధపడుతున్నారని తేలింది.
అధ్యయనం ఏం చెబుతోంది..?:
నెదర్లాండ్స్, బెల్జియంలోని పరిశోధకులు 36,000 మందిపై అధ్యయనం చేశారు. రాత్రి షిఫ్ట్‌లలో పనిచేసే చాలా మంది వ్యక్తులు నిద్రలేమి మరియు హైపర్సోమ్నియావంటి కొన్ని రకాల నిద్ర రుగ్మతలతో బాధపడుతున్నారని గుర్తించారు. పగటి షిఫ్టులో పనిచేసే వారి కంటే రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవాళ్లు తక్కువ నిద్రపోతారని అధ్యయనం వెల్లడించింది. రాత్రి షిఫ్టులలో పనిచేసే 51 శాతం మందికి కనీసం ఒక నిద్ర రుగ్మత ఉన్నట్లు చెబుతున్నారు.
పరిశోధకుల సూచన:
ఇలాంటి పరిస్థితుల్లో నైట్ షిఫ్ట్ (Night Shifts)రెగ్యులర్‌గా చేయకుండా రొటేషన్ పద్ధతిలో చేయాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు నైట్ వర్క్ తగ్గించుకోవాలని అంటున్నారు. రాత్రి షిఫ్టులలో పని చేస్తున్నప్పుడు ఎక్కువగా ఆకలి అవుతుంటుంది. అప్పటికప్పుడు దొరికే స్నాక్స్ తింటుంటారు. అవి అనారోగ్యానికి గురిచేస్తాయని అంటున్నారు. ఒకవేళ రాత్రి సమయంలో ఆకలి వేస్తే గింజలు, పండ్లను తినాలని సూచిస్తున్నారు. రాత్రి డ్యూటీలు చేసేవారు పగటి సమయంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల అలసట ఉండదని, సోమరిపోతుగా మారరని అంటున్నారు. నైట్ షిప్ట్‌లు ఎక్కువగా చేసేవారు ఉదయం అల్పాహారాన్ని అస్సలు మిస్ చేయకూడదని, ప్రతిరోజు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పోషకాలు అధికంగా ఉండే గింజలు, పండ్లు, కూరగాయలను తినాలని, రాత్రి సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోకూడదని, అలా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మహిళల నడుము సైజుకు..సంతానలేమికి సంబంధం ఉందా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.