Black Beans: బీన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. అందులో బ్లాక్ బీన్స్ ఒకటి. ఇది ఇతర బీన్స్ కంటే కూడా చౌకగా దొరుకుతుంది. అంతేకాకుండా పోషకాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. బ్లాక్ బీన్స్‌ను రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. బ్లాక్ బీన్స్‌లోని కార్బోహైడ్రేట్లు ఇతర బీన్స్ కంటే భిన్నమైన పరమాణు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. బీన్స్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
బ్లాక్ బీన్స్‌లో పోషకాలు:
- బ్లాక్ బీన్స్‌లో ఫైబర్, ఫోలేట్, కాపర్, విటమిన్ B1, ఫాస్పరస్,మాంగనీస్, ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి.
పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
- బ్లాక్ బీన్స్‌లోని కార్బోహైడ్రేట్లు మనకు రెసిస్టెంట్ స్టార్చ్‌గా పనిచేస్తాయి. ఒత్తిడి నుంచి చిన్న పేగులను కాపాడుతాయి. బ్యాక్టీరియా కారణంగా పేగులపై ఒత్తిడి పడకుండా కాపాడుతాయని నిపుణులు అంటున్నారు.
మధుమేహానికి మంచిది:
- చికెన్, చేపలలో లభించే ప్రోటీన్లు ఈ బ్లాక్ బీన్స్ ఎక్కువగా ఉంటాయి. మంచి ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బ్లాక్ బీన్స్‌లో కొలెస్ట్రాల్ ఉండదని, మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి బాగా సహాయపడతాయని అంటున్నారు.
గుండె ఆరోగ్యం:
- బ్లాక్ బీన్స్‌లోని డైటరీ ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
బరువు కంట్రోల్:
- బ్లాక్ బీన్స్‌లో ఉండే డైటరీ ఫైబర్ ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీంతో అధిక కేలరీల తీసుకోవడం నివారిస్తుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్:
- బ్లాక్ బీన్స్‌లోని పాలీఫెనిల్స్ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇందులో ఉండే పాలీఫినైల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్లు ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
ఇది కూడా చదవండి: పుట్టుమచ్చల్లో ఈ మార్పులు క్యాన్సర్‌కి సంకేతాలు కావచ్చు.. అవేమిటంటే..!!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.