Iron Levels: శరీరంలో ఎప్పుడైతే పోషక విలువల లోపం ఉంటుందో అప్పుడు శరీరంలో జరిగే ప్రక్రియలు సరిగ్గా జరగవు. దాంతో ఆనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం ఐరన్ డెఫిషియన్సీ సమస్యను ఎక్కువ మంది ఎదుర్కొంటున్నారు. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఈ టిప్స్‌తో ఐరన్ లెవెల్స్ మెరుగుపరుచుకోని రోజంతా ఉత్తజంగా ఉంటారని నిపుణులు చేబుతున్నారు. అంతేకాకుండా ఎలాంటి ప్రమాదాలు రాకుండా.. రక్తహీనత దరిచేరకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే శరీరంలో తగినంత ఐరన్ లెవెల్స్ అసవరం ఉంది. హిమోగ్లోబిన్ సరిపడా ఉంటే శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేందుకు ఐరన్ ముఖ్యమటున్నారు.
ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే
రక్తహీనత దరిచేరకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే శరీరంలో తగినంత ఐరన్ లెవెల్స్ ఉండాటున్నారు ఆరోగ్య నిపుణులు. హిమోగ్లోబిన్ సరిపడా ఉంటూ శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేందుకు ఐరన్ అత్యంత ముఖ్యం. అయితే..ఈ ఐరన్ లోపం ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా శాకాహారం తీసుకునే మహిళలు ఐరన్‌తో కూడిన ఆహారం తీసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే.. ఆహారంలో చిన్నపాటి మార్పులతో ఐరన్ లెవెల్స్‌ను అధికంగా పెంచుకోవచ్చు.
ఇలాంటి ఆహారాలను దూరం చేస్తే మంచిది
ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు అయిన బీన్స్, పప్పు ధాన్యాలు, పాలకూల,లీన్‌మీట్స్, పౌల్ట్రీ, సీఫుడ్, బ్రకోలి, ఫోర్టిపైడ్ సిరిల్స్, బ్రెడ్ వంటి తీసుకోసుకుంటే మంచిది. విటమిన్-సీ ఎక్కువగా ఉన్న ఆహారం ప్రతిరోజు తీసుకోవాలి. శరీరం ఐరన్‌ను సంగ్రహించడాన్ని నిరోధించే కాఫీ, టీ, క్యాల్షియంతో కూడిన ఆహారాలను ఎక్కువ దూరం చేస్తే మంచిది. ఐరన్‌తో కూడిన ఆహారం తీసుకున్న వెంటనే వీటిని తీసుకోవడం మంచిది కాదు. క్యాస్ట్ ఐరన్ వంట పాత్రలతో వండిన ఆహారంతో ఐరన్ సంగ్రహించే శక్తి అధికంగా పెరుగుతుంది. వైద్యుల సూచనలకు అనుగుణంగా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను వస్తయని చెబుతున్నారు. అంతేకాదు విటమిన్- బీ12తో కూడిన ఆహారం శరీరం ఐరన్ సంగ్రహించే శక్తిని ఇస్తుంది. ప్రేవుల ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చూసుకుంటూ ఐరన్ లెవెల్స్‌ను తరచూ చెక్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు.
ఇది కూడా చదవండి: మనల్ని కాపాడేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్..అయితే వాళ్లకు మాత్రమే