Eating Chili Benefits: కారం ఎక్కువగా తింటే ఇన్ని ప్రయోజనాలా?

కారం ఎక్కువ తింటే కోపం వస్తుందని పెద్దలు అంటుంటారు. కాకపోతే కొన్ని అధ్యయనాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. చప్పిడి ఆహారం తినేవారికంటే కారం తినే వారే ఎక్కువ రోజులు బతుకుతున్నారని వైద్యులు చేసిన కొన్ని పరిశోధనల్లో తేలింది.

 Eating Chili Benefits: కారం ఎక్కువగా తింటే ఇన్ని ప్రయోజనాలా?
New Update

Eating Chili Benefits: మనం నిత్యం అనేక రుచులను చూస్తుంటాం. వీటిల్లో కారం ముఖ్యమైనది. అంతేకాకుండా షడ్రుచుల్లో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మనం చేసే వంటలకు కారం మంచి రుచిని తీసుకొస్తుంది. కారం ఎక్కువ తక్కువ అయినా కూరలు చెడిపోయే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కారాన్ని పౌరుషానికి చిహ్నంగా చెప్పుకుంటారు. కోపం ఎక్కువగా రావాలంటే అధికంగా కారం తినాలని పెద్దలు అంటుంటారు. ఇలా ఉంటే కారం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు అంటున్నారు. గ్యాస్‌ ట్రబుల్‌, అజీర్తితో బాధపడేవారు, చిన్న పిల్లలు కారం ఎక్కువ తింటే విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. కారం వల్ల కొందరికి నష్టం జరిగితే, మరికొందరికి లాభం జరుగుతుంది. అయితే కారం తినడం వల్ల ఎక్కువ కాలం బ్రతకవచ్చని వైద్యులు చేసిన కొన్ని పరిశోధనల్లో తేలింది.

పరిశోధనల్లో అద్భుతమైన విషయాలు వెలుగులో..

కారం వల్ల కడుపులో మంట, పేగులో పుండ్లు, గుండెల్లో మంట, గ్యాస్ ట్రబుల్ వస్తుందని కొందరు వైద్యులు అంటుంటారు. అందుకే ఉప్పు, కారం తగ్గించి ఆహారాన్ని తినమని చెబుతుంటారు. కాకపోతే కొన్ని అధ్యయనాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. చప్పిడి ఆహారం తినేవారికంటే కారం తినే వారే ఎక్కువ రోజులు బతుకుతున్నారని అంటున్నారు. చైనా ప్రజల మీద జరిపిన కొన్ని పరిశోధనల్లో అద్భుతమైన విషయాలు వెలుగు చూశాయి. కారం, మిరియాలు తిన్న వారిలో మరణాల రేటు తక్కువగా ఉందని అంటున్నారు. అలా అని రోజూ గొడ్డుకారం తినకూడదని, తగిన మోతాదులోనే కారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది కూడ చదవండి: బియ్యానికి పురుగులు పట్టకుండా ఇలా చేయండి

అయితే.. అధ్యనాల్లో మాత్రం మరణాల సంఖ్య కారం తక్కువ తినే వారితో పోలిస్తే ఎక్కువ తీసుకునే వారిలోనే తక్కువగా ఉందని తేలింది. వారానికి రెండుసార్లు మాత్రమే కారం తీసుకునే వారితో పోలిస్తే రోజూ కారం తినేవారిలో 10శాతం మరణించే అవకాశం తగ్గిందని నిపుణులు అంటున్నారు. ఎండుకారం కంటే పచ్చిమిర్చితో చేసిన కారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. అయితే.. ఇతర దేశాల శాస్త్రవేత్తలు మాత్రం చైనాలోని పరిశరాలు, అక్కడ వంటకాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని, ఫలితాలు అన్నిచోట్ల వస్తాయని నమ్మకం లేదని చెబుతున్నారు. ప్రయోజనాలు ఉన్నాయి కదా అని కారాన్ని ఎక్కువగా తిని అనర్ధాలు తెచ్చుకోవద్దని దేన్ని అయినా మితంగా వాడితేనే మేలు జరుగుతుందని అంటున్నారు.

#health-benefits #tips #eating-more-chili
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe