New Year Celebrations in Araku: అరకులోయ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా సెలవులు వస్తే చాలు వివిధ ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రియులు పోటెత్తుతారు. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అరకులోయ అందంగా రెడీ చేశారు. హోటళ్లు, లాడ్జిలు, దేవాలయాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి.
Also Read: అమలాపురం వైసీపీలో అయోమయం.. టికెట్ కోసం తండ్రీకొడుకుల మధ్యే వార్!
పర్యాటక ప్రదేశాలు జనంతో కిటికిటలాడుతున్నాయి. ఎక్కడికక్కడ ఫైర్ క్యాంపు లతో ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. ఇప్పటికే ఉన్న హోటల్లో లాడ్జిలో ఫుల్ అవడంతో సదుపాయాలు దొరకని వారు రోడ్ల ప్రక్కనా, చెట్ల కింద కాలక్షేపం చేస్తున్నారు. గిరిజన మ్యూజియంకు వచ్చే పర్యాటకులకు ఐటీడీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Also Read: జూబ్లీహిల్స్‌లో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. తొలిసారి బ్రౌన్‌షుగర్ పట్టివేత..
న్యూ ఇయర్ కావడంతో ఈ రెండు రోజులు రాత్రీ, పగలు మ్యూజియం తెరిచి ఉండే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, పర్యాటకులకై పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు రెడీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎక్కడ చూసినా పర్యాటక సందడి కనిపిస్తోంది. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని బీచ్‌లు, అరకు, లంబసింగి, పాడేరు పర్యాటక ప్రదేశాలు నిండిపోయాయి.