April 1st: ఏప్రిల్ 1 వచ్చేసింది. ఈ రోజు ఫూల్స్ డే అని అందరికి తెలిసిందే. ఒకరినొకరు సరదాగా ఫూల్స్ చేసుకుంటారు. 1381లో తొలిసారిగా ఏప్రిల్ 1న ఈ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయని చెబుతారు. ఇంతకుముందు ఈ రోజును ఫ్రాన్స్‌తో పాటు కొన్ని ఇతర యూరప్ దేశాలలో మాత్రమే జరుపుకునేవారు. కాని క్రమంగా ఏప్రిల్ ఫూల్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో జరుపుకోవడం మొదలైంది. కొన్ని నివేదికల ప్రకారం భారత్‌లో ఈ రోజును 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ప్రారంభించారు. అయితే ఏప్రిల్ 1న ఫూల్స్ డేతో పాటు ఆ రోజు వేరే ఘటనలు కూడా జరిగాయి అవేంటో తెలుసుకోండి.
ఏప్రిల్ 1న జరిగిన ప్రధాన ఘట్టాలు:
• 1793: జపాన్‌లోని అన్సెన్ అగ్నిపర్వతం పేలి 53,000 మంది మరణించారు.
• 1839: కోల్‌కోతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 20 పడకలతో ప్రారంభమైంది.
• 1889: ది హిందూ దినపత్రిక దినపత్రికగా ప్రచురణ ప్రారంభించింది. 1888 సెప్టెంబరు 20 నుంచి ప్రచురింపబడుతున్న ఈ వార్తాపత్రిక ఇప్పటి వరకు వారపత్రికగా ప్రచురితమవుతోంది.
• 1912: భారతదేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి అధికారికంగా మార్చచారు.
• 1930: కనీస వివాహ వయస్సు బాలికలకు 14 సంవత్సరాలు, అబ్బాయిలకు 18 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
• 1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన.
• 1936: ఒరిస్సా రాష్ట్ర స్థాపన. ఇది బీహార్ నుంచి వేరు చేయబడింది.
• 1937: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ జననం.
• 1969: దేశంలోని మొదటి అణువిద్యుత్ కేంద్రం తారాపూర్ లో పనిచేయడం ప్రారంభించింది.
• 1973: భారతదేశంలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో పులుల సంరక్షణ ప్రాజెక్టు ప్రారంభమైంది.
• 1976: దూరదర్శన్ పేరుతో టెలివిజన్ కోసం ఒక ప్రత్యేక సంస్థను స్థాపించారు.
• 1976: స్టీవ్‌జాబ్స్ తన స్నేహితులతో కలిసి యాపిల్ కంపెనీని స్థాపించాడు.
• 1979: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా అవతరించింది.
• 2004: గూగుల్ జీమెయిల్‌ను ప్రకటించింది.
ఇది కూడా చదవండి: విశాఖవాసుల కల నెరవేరింది..మ్యాచ్ ఓడిపోయినా..ధోనీ మెరిసాడు