April 1st: ఏప్రిల్‌ ఫస్ట్‌ ఫూల్స్‌ డే మాత్రమే కాదు..ఆ రోజు జరిగిన ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకుంటే షాకే!

ఏప్రిల్ ఫస్ట్ అంటే ఫూల్స్‌ డే మాత్రమే కాదు. యాపిల్ కంపెనీని స్థాపించిన రోజు ఇదే. గూగుల్ జీమెయిల్‌ను ప్రకటించిన డేట్ కూడా ఇదే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన తేదీ కూడా ఆ రోజే. ఇలా ఏప్రిల్‌ 1న జరిగిన ముఖ్యమైన ఘట్టాల గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.  

New Update
April 1st: ఏప్రిల్‌ ఫస్ట్‌ ఫూల్స్‌ డే మాత్రమే కాదు..ఆ రోజు జరిగిన ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకుంటే షాకే!

April 1st: ఏప్రిల్ 1 వచ్చేసింది.  ఈ రోజు ఫూల్స్‌ డే అని అందరికి తెలిసిందే. ఒకరినొకరు సరదాగా ఫూల్స్ చేసుకుంటారు. 1381లో తొలిసారిగా ఏప్రిల్ 1న ఈ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయని చెబుతారు. ఇంతకుముందు ఈ రోజును ఫ్రాన్స్‌తో పాటు కొన్ని ఇతర యూరప్‌ దేశాలలో మాత్రమే జరుపుకునేవారు. కాని క్రమంగా ఏప్రిల్ ఫూల్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో జరుపుకోవడం మొదలైంది. కొన్ని నివేదికల ప్రకారం భారత్‌లో ఈ రోజును 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ప్రారంభించారు. అయితే ఏప్రిల్‌ 1న ఫూల్స్‌ డేతో పాటు ఆ రోజు వేరే ఘటనలు కూడా జరిగాయి అవేంటో తెలుసుకోండి.

ఏప్రిల్‌ 1న జరిగిన ప్రధాన ఘట్టాలు:

• 1793: జపాన్‌లోని అన్సెన్ అగ్నిపర్వతం పేలి 53,000 మంది మరణించారు.

• 1839: కోల్‌కోతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 20 పడకలతో ప్రారంభమైంది.

• 1889: ది హిందూ దినపత్రిక దినపత్రికగా ప్రచురణ ప్రారంభించింది. 1888 సెప్టెంబరు 20 నుంచి ప్రచురింపబడుతున్న ఈ వార్తాపత్రిక ఇప్పటి వరకు వారపత్రికగా ప్రచురితమవుతోంది.

• 1912: భారతదేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి అధికారికంగా మార్చచారు.

• 1930: కనీస వివాహ వయస్సు బాలికలకు 14 సంవత్సరాలు, అబ్బాయిలకు 18 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.

• 1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన.

• 1936: ఒరిస్సా రాష్ట్ర స్థాపన. ఇది బీహార్ నుంచి వేరు చేయబడింది.

• 1937: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ జననం.

• 1969: దేశంలోని మొదటి అణువిద్యుత్ కేంద్రం తారాపూర్ లో పనిచేయడం ప్రారంభించింది.

• 1973: భారతదేశంలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో పులుల సంరక్షణ ప్రాజెక్టు ప్రారంభమైంది.

• 1976: దూరదర్శన్ పేరుతో టెలివిజన్ కోసం ఒక ప్రత్యేక సంస్థను స్థాపించారు.

• 1976: స్టీవ్‌జాబ్స్ తన స్నేహితులతో కలిసి యాపిల్ కంపెనీని స్థాపించాడు.

• 1979: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా అవతరించింది.

• 2004: గూగుల్ జీమెయిల్‌ను ప్రకటించింది.

ఇది కూడా చదవండి: విశాఖవాసుల కల నెరవేరింది..మ్యాచ్ ఓడిపోయినా..ధోనీ మెరిసాడు

Advertisment
తాజా కథనాలు