APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 డిగ్రీ లెక్చరర్ పోస్టులు

ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల రిలీజ్ చేసిన 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మరో 50 పోస్టులను కలుపుతూ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తం 290 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా ఫిబ్రవరి 13 వరకూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

APPSC Group-1: నేడే గ్రూప్-1 ఎగ్జామ్.. అరగంట ముందే ఎగ్జామ్ హాల్ లోకి.. పూర్తి వివరాలివే!
New Update

APPSC Degree Lecturer Recruitment: ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో భాగంగానే డిసెంబర్‌ 30న మొత్తం 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఈ ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తాజాగా మరో 50 డిగ్రీ లెక్చరర్ పోస్టులను పెంచుతూ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. డిగ్రీ మొత్తం 290 లెక్చరర్‌ పోస్టుల (Lecturer Posts) భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ఈ మేరకు సబ్జెక్టుల వారీగా బయోటెక్నాలజీ 4, బోటనీ 20, కెమిస్ట్రీ 23, కామర్స్‌ 40, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 49, కంప్యూటర్‌ సైన్స్‌ 48, ఎకనామిక్స్‌ 15, ఇంగ్లిష్‌ 5, హిస్టరీ 15, మేథమేటిక్స్‌ 25, మైక్రోబయోలజీ 4, పొలిటికల్‌ సైన్స్‌ 15, తెలుగు 7, జువాలజీ 20 చొప్పున మొత్తం 290 పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ:

అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో https://psc.ap.gov.in/ ఫిబ్రవరి 13 వరకూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

వయో పరిమితి:

2023 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఎన్‌సీసీ కేటగిరీకి చెందినవారికి మూడేళ్లు చొప్పున వయో సడలింపు ఉంది.

ఇది కూడా చదవండి : ఎన్‌సీఈఆర్టీలో ప్రూఫ్‌ రీడర్‌, డీటీపీ ఆపరేటర్ ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు

అప్లికేషన్ ఫీజు:

అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.250తో పాటు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌, తెల్లరేషన్‌ కార్డు కలిగిన మహిళలతో పాటు మరికొందరికి ప్రాసెసింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు.

పరీక్ష విధానం:

మార్కులు ఇలా..: డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్‌- 1 జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్‌)తో ఉంటుంది. 150 ప్రశ్నలకు 150 మార్కులు. ఈ పరీక్షకు 150 నిమిషాలు కేటాయించారు. అలాగే, అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుపైనే పేపర్‌- 2 పరీక్ష (పీజీ స్టాండర్డ్‌తో) ఉంటుంది. 150 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి. 150 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్‌ మార్కు ఉంటుంది.

వేతనం:

ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.57,700 -రూ.1,82,400 వరకు వేతనం అందిస్తారు.

Notification PDF

#appsc #appsc-dl-recruitment #appsc-degree-lecturer #degree-lecturer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe