ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల, ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ జులై 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. గ్రూప-1 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు.

New Update
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

APPSC Group1 Mains Result Released..Interviews from 2nd August

ఫలితాలు విడుదల

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ నిన్న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. గ్రూప-1 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఏపీలో మొత్తం 111 గ్రూప్‌-1 పోస్టులకుగాను 259 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్స్‌ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన 6 వేల 455 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.

విజయవంతంగా పరీక్ష
అయితే ఏపీలో ఖాళీగా ఉన్న 111 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. గ్రూప్-1కు మొత్తం లక్షా 26 వేల 449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో లక్షా 6 వేల 473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా.. ఇందులో 87 వేల 718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైయ్యారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైయ్యారు.

వచ్చే నేల నుంచి ఇంటర్వ్యూలు

మొత్తం 111 గ్రూపు-1 ఉద్యోగాల‌కుగాను 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్ కోటా నుంచి ఎంపికయ్యారు. APPSCగ్రూప్-1 మెయిన్స్‌ పరీక్ష జరిగిన కేవలం 34 రోజులలోనే ఫలితాలు విడుదల చేసింది. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు మొత్తం 5035 మంది హాజరు కాగా.. వీరిలో 259 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఏపీపీఎస్సీ ప్రతిష్టాత్మంకంగా నిర్వహించిన గ్రూపు-1 పరీక్షలు ఎటువంటి అక్రమాలకు, అవినీతికి తావివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించారు. మూల్యాంకన స్క్రూటినీ కార్యక్రమాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరిగింది. ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలను నిర్వహించి సెప్టెంబర్‌ నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది కమిషన్‌. ముందుగా నిర్ణయించినట్టుగానే క్యాలెండర్ ప్రకారం సకాలంలోనే నియామకాలు జరుగుతాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు