APPSC Group 2: ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. 897 పోస్టులతో గ్రూప్ 2

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. రాష్ట్ర యువత, విద్యార్థులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేష‌న్ ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 897 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

New Update
APPSC Group 2: ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. 897 పోస్టులతో గ్రూప్ 2

APPSC Group 2 Notification 2023: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. రాష్ట్ర యువత, విద్యార్థులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేష‌న్ ఎట్టకేలకు విడుదలైంది. పోటీ పరీక్షల కోసం చాలాకాలంగా సాధన చేస్తున్న అభ్యర్థులకు జగన్‌ ప్రభుత్వ ఈ నిర్ణయం ఉత్సాహాన్నిచ్చింది. ముందుగా చెప్పినట్టుగానే పెద్దసంఖ్యలో గ్రూప్‌ 2 (Group 2) ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ (APPSC) నుంచి నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 897 పోస్టుల‌తో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: 24 గంటల కరెంట్ ఇవ్వడం మా గ్యారెంటీ – శ్రీధర్ బాబు

ఏపీపీఎస్సీ ప్రకటించిన మొత్తం 897 పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, మిగతా 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబ‌ర్ 21 నుంచి జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నియామకాలను వేగవంతంగా పూర్తిచేస్తామని ముందునుంచి చెప్తున్నట్టుగానే, పరీక్షల తేదీలను కూడా నోటిఫికేషన్‌లోనే ప్రకటించారు.

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు దశల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హులు. పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

Notification PDF

APPSC Website

Advertisment
తాజా కథనాలు