ఏపీలో నేడు జరగనున్న గ్రూప్-1 (APPSC Group-1) పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణపై అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే మొత్తం 89 గ్రూప్-1 ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 1.48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు మొత్తం 301 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: AP EAPCET 2024: ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!
- ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించి ఉదయం 9.45 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
- పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్లలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.
- పరీక్ష నిర్వహణకు మొత్తం 301 మంది లైజనింగ్ అధికారులు, 6612 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఏపీపీఎస్సీ నుంచి 39 మంది పర్యవేక్షించనున్నారు.