AP Assembly: పలు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు బిల్లు, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు బిల్లు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
నాడు నేడుపై విచారణ..
రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు-నేడు అంటూ, గత ప్రభుత్వం చేసింది మొత్తం ప్రచార ఆర్భాటమే అని అన్నారు. రెండు విడతల్లో చేసిన నాడు-నేడు పనులు మొత్తం అవినీతి, నాసిరకం అని పేర్కొన్నారు. రెండు విడతల్లో పనులు మొత్తం పెండింగ్ పెట్టారని ఆరోపించారు. మూడో విడత అసలు మొదలే కాలేదని అన్నారు. రూ.900 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్లారని చెప్పారు.
Also Read: భారీగా తగ్గనున్న బంగారం, సెల్ ఫోన్ ధరలు