Mulugu: ములుగు జిల్లా అధ్యక్షులుగా కాకులమర్రి లక్ష్మణ్‌బాబు నియామకం

ములుగు జిల్లా అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబును నియమించారు. ఘట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుని అనంతరం గట్టమ్మ నుండి జిల్లా కేంద్రం వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి గజమాలతో స్వాగతం పలికారు.

New Update
Mulugu: ములుగు జిల్లా అధ్యక్షులుగా కాకులమర్రి లక్ష్మణ్‌బాబు నియామకం

ములుగు జిల్లా అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబును నియమించారు. ఘట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుని అనంతరం గట్టమ్మ నుండి జిల్లా కేంద్రం వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు.  జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఇవ్వడం సంతోషకరమని  కాకులమర్రి లక్ష్మణ్ బాబు తెలిపారు. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయం జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతిని ఎమ్మెల్యేగా గెలిపించి కేసీఆర్‌కు కానుకగా అందిస్తానని తెలిపారు. ములుగు జిల్లా నూతన అధ్యక్షులను ఆత్మీయ సన్మానించిన జ్యోతక్క, బడే నాగజ్యోతి, ఎర్వ సతీష్‌రెడ్డి నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.

ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కాకులమర్రి లక్ష్మణ్ బాబును నూతనంగా నియమించి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లాకు విచ్చేసిన శుభ సందర్భంగా వారిని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. అనంతరం గట్టమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. తదనంతరం విలేకరుల సమావేశంలో బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. నూతన అధ్యక్షుడిగా ఎన్నిక అయినా అన్న లక్ష్మణ్ అన్నకి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు ఇండ్లు మంజూరు చేస్తే ములుగు ప్రతి పక్ష ఎమ్మెల్యే అవాకులు చెవాకులు మాట్లాడుతుంది.

పేదలకు ఇండ్లు పంచుతాం..ప్రజలను పక్క దోవ పట్టించాలను చూడం దారుణం అన్నారు. మా కార్యకర్తలు ప్రజల కోసం పని చేసే సేవకులు.. మా కార్యకర్తలపైన అసత్యాలు ఆరోపణలు చేస్తే ప్రజాలలో నీకు ఉండే మంచి మర్యాదలు కూడా కోల్పోతావు అని హెచ్చరించారు. ములుగులో గెలిచ్చేది గులాబీ జెండా..పార్టీ కార్యకర్తలు భుజం కాచి గులాబీ జెండాను ఎత్తి జై కొట్టి ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకగా ఇస్తారని అన్నారు.

రెడ్ కో-చైర్మన్ ఎర్వ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. మన పార్టీ నుండి ఎమ్మెల్యే 2018లో కోల్పోయాం కానీ మన కార్యకర్తలు గుండె ధైర్యంగా ఉన్నారు. ఎంపీ గెలిచాం.. స్థానిక ఎన్నికల్లో గెలిచాం.. ఇప్పుడు వరకు మన పార్టీ నుండి ఎవరు కూడా వేరే పార్టీ మారలేదన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మన విజయానికి భరోసా ఇస్తామన్నారు. బడే నాగజ్యోతి గెలుపు నల్లేరు మీద నడకే అన్నారు. నూతనంగా నియమించబడిన ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబుకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే గెలుపు ఖాయం అయిపోయింది అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు