Watermelon face: వేసవిలో చర్మాన్ని అందంగా, హైడ్రేటెడ్ గా ఉంచడానికి పుచ్చకాయ రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ముఖాన్ని మెరిసేలా చేసుకోవాలంటే పుచ్చకాయ రసాన్ని ఉపయోగించాలి. దీని ద్వారా మెరిసే చర్మాన్ని పొందుతారు. పుచ్చకాయతో మెరిసే ముఖం రహస్యాన్ని గురించి చాలామందికి తెలియదు. దీనిని ఎలా వాడో, ముఖానికి కలగితే ప్రయోజనాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పుచ్చకాయ రసం ముఖానికి వాడే విధానం:
- పుచ్చకాయ రసం చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది ముఖంలోని ముడతలను తగ్గిస్తుంది, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.
- పుచ్చకాయ వేసవిలో శరీరాన్ని చల్లబరచడమే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు.
- పుచ్చకాయ రసాన్ని ఉపయోగించడం ద్వారా ముఖంపై మచ్చలు, ముడతలను తగ్గించుకోవచ్చు.
- పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది.
- సమాచారం ప్రకారం.. పుచ్చకాయలో లైకోపీన్ ఉంటుంది. ఇది సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
- పుచ్చకాయ రసాన్ని నేరుగా అప్లై చేసుకోవచ్చు, దానికి కొద్దిగా పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవచ్చు.
- కొందరికి పుచ్చకాయకు అలెర్జీ ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. ఇది జరిగితే.. దానిని ఉపయోగించడం ఆపివేసి చర్మ డాక్టర్లని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ గ్రీన్ వెజిటేబుల్ గుడ్డు చీజ్ కంటే ఎక్కువ బలాన్ని ఇస్తుంది!