స్కాలర్‌షిప్‌లతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.. ఆర్థికంగా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. స్కూల్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు ఎన్నో స్కాలర్‌షిప్‌లకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు ఓ లుక్కేసి ఉంచితే మంచిది. విద్యార్థులకు వారి కలలను సాకరం చేసుకునేందుకు.. ఆర్థిక సహాయం, అవకాశాలను అందించడంలో స్కాలర్‌షిప్‌లు చాలా కాలంగా కీలకంగా ఉంటున్నాయి. విద్యా సంస్థలు, కార్పొరేషన్లు, ఫౌండేషన్‌లు, ప్రభుత్వ ఏజెన్సీలు తరచుగా అందించే ఈ మెరిట్ ఆధారిత అవార్డులు ట్యూషన్ ఫీజులు, ఖర్చుల భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఆగస్ట్, సెప్టెంబర్ మధ్య మీరు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉన్న మూడు స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ల గురించి తెలుసుకోండి.
🅐 ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనక్ స్కీమ్:
ఇది 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్. ఈ పథకం పాఠశాల విద్యార్థులలో వినూత్న ఆలోచనలను పెంపొందించలనే ప్రాథమిక లక్ష్యంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST), సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేసిన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్.
అర్హత: 10-15 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు.. 6 నుంచి 10వ తరగతి మధ్య చదువుతూ ఉండాలి.
స్కాలర్‌షిప్: రూ.10,000 (ఒకసారి)
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 31-08-2023
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
అప్లికేషన్ లింక్: https://www.inspireawards-dst.gov.in/userp/school-authority.aspx
🅑 రోల్స్ రాయిస్ ఉన్నతి స్కాలర్‌షిప్ 2023:
మహిళా విద్యార్థుల కోసం అందిస్తున్న స్కాలర్‌షిప్ ఇది. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులను అభ్యసిస్తున్న మహిళా విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది రోల్స్ రాయిస్. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడంలో ప్రతిభావంతులైన బాలికలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఈ స్కాలర్‌షిప్ ప్రవేశ పెట్టారు.
అర్హత:
AICTE - గుర్తింపు పొందిన సంస్థలో ఏరోస్పేస్, మెరైన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ మొదలైన రంగాలలో ప్రస్తుతం 1వ/2వ/3వ సంవత్సరం ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు వారి 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలలో 60శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
స్కాలర్‌షిప్: రూ.35,000
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 31-08-2023
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
అప్లికేషన్ లింక్: https://www.buddy4study.com/page/rolls-royce-unnati-scholarships-for-women-engineering-students
🅒 రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్ 2023:
హీరో ఫిన్‌కార్ప్ సపోర్ట్‌తో రామన్ కాంత్ ముంజాల్ ఫౌండేషన్ ఈ స్కాలర్‌షిప్‌ని ఇస్తుంది. ఫైనాన్స్ సంబంధిత కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ప్రఖ్యాత కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ స్కాలర్‌షిప్ యూజ్ అవుతుంది.
అర్హత:
BBA, BFIA, B.Com ఒకటో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. BMS, IPM, BA (ఎకనామిక్స్), BBS, BBI, BAF, B.Sc లేదా ఏదైనా ఇతర ఫైనాన్స్(finance) సంబంధిత డిగ్రీ కోర్సులు చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వాళ్లు 10 లేదా 12 తరగతుల పరీక్షల్లో కనీసం 80శాతం మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
స్కాలర్‌షిప్: 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ.5 లక్షలు చెల్లిస్తారు
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 15-09-2023
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
అప్లికేషన్ లింక్: https://www.buddy4study.com/page/raman-kant-munjal-scholarships