Railway Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2,860 ఉద్యోగాలకు పరీక్ష లేకుండానే జాబ్ రిక్రూట్‌మెంట్! ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 2,860 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 29న దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. By Trinath 21 Feb 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Railway Recruitment Cell : 10వ తరగతి పాస్(10th Class Pass) అయిన వారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. 10వ తరగతి ఉత్తీర్ణులై, ఐటీఐ సర్టిఫికేట్(IIT Certificate) కలిగి ఉంటే మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. రైల్వేలో ఉద్యోగం(Railway Job) పొందడానికి ఇదే మంచి అవకాశం. దక్షిణ రైల్వే పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 2,860 అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి,అర్హత ఉన్న ఏ అభ్యర్థి అయినా భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్.. "sr.indianrailways.gov.in" ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు(Online Application) చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 29న ప్రారంభమవగా.. ఫిబ్రవరి 28న ముగుస్తుంది. అంటే మరో వారం రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. మీరు కూడా సదరన్ రైల్వే అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ కింద ఉద్యోగం పొందాలనుకుంటే.. ఖాళీలు, అర్హతలు, ఇతర వివరాలను ఇక్కడ వివరంగా చూడండి. పోస్టుల వివరాలు: సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్/పొదనూర్, కోయంబత్తూర్: 20 పోస్టులు క్యారేజ్ & వ్యాగన్ వర్క్స్/పెరంబూర్: 83 పోస్టులు రైల్వే హాస్పిటల్/పెరంబూర్ (MLT): 20 పోస్టులు మాజీ ITI పోస్టులు సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్/పొదనూర్, కోయంబత్తూర్: 95 పోస్టులు తిరువనంతపురం డివిజన్: 280 పోస్టులు పాలక్కాడ్ డివిజన్: 135 పోస్టులు సేలం డివిజన్: 294 పోస్టులు క్యారేజ్ & వ్యాగన్ వర్క్స్/పెరంబూర్: 333 పోస్టులు లోకో వర్క్స్/పెరంబూర్: 135 పోస్టులు ఎలక్ట్రికల్ వర్క్‌షాప్/పరంబూర్: 224 పోస్టులు ఇంజినీరింగ్ వర్క్‌షాప్/అరక్కోణం: 48 పోస్టులు చెన్నై డివిజన్/పర్సనల్ బ్రాంచ్: 24 పోస్టులు చెన్నై డివిజన్ - ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/అరక్కోణం: 65 పోస్టులు చెన్నై డివిజన్ - ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/ఆవడి: 65 పోస్టులు చెన్నై డివిజన్ - ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/తాంబరం: 55 పోస్టులు చెన్నై డివిజన్ - ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/రోయపురం: 30 పోస్టులు చెన్నై డివిజన్ - మెకానికల్ (డీజిల్): 22 పోస్టులు చెన్నై డివిజన్ - మెకానికల్ (క్యారేజ్ & వ్యాగన్): 250 పోస్టులు చెన్నై డివిజన్ - రైల్వే హాస్పిటల్ (పెరంబూర్): 3 పోస్టులు సెంట్రల్ వర్క్‌షాప్, పొన్మలై: 390 పోస్టులు తిరుచిరాపల్లి డివిజన్: 187 పోస్టులు మదురై డివిజన్: 102 పోస్టులు అర్హత: ఫిట్టర్,వెల్డర్ (గ్యాస్,ఎలక్ట్రిక్): అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 50శాతం మార్కులతో 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండాలి. CLICK HERE FOR DETAILED NOTIFICATION Also Read : గిరిజనుల గుండెల్లో కొలువైన దేవతలకు భక్తజన నీరాజనం సమ్మక్క-సారక్క జాతర #railway-jobs #online-applications #railway-recruitment-cell #iit-certificate మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి