Skin Care: బాదంపప్పులను ఇలా వాడండి.. మీ ముఖం తలాతలా మెరిసిపోతుంది!

బాదంపప్పును ఉపయోగించడం ద్వారాముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ, బి, అనేక పోషకాలు చర్మానికి పోషణను అందిస్తాయి. బాదంపప్పును బాదం ముద్ద, బాదం పాలు, బాదం-ఓట్స్ ఫేస్‌ప్యాక్ ఉపయోగించడం ద్వారా ముఖం మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Skin Care: బాదంపప్పులను ఇలా వాడండి.. మీ ముఖం తలాతలా మెరిసిపోతుంది!

Skin Care Tips: ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా ముఖం మెరిసిపోవాలంటే బాదం వాడకం గురించి తెలుసుకోండి. బాదంపప్పును ఉపయోగించడం ద్వారా మీ చర్మాన్ని మృదువుగా, అందంగా మార్చుకోవచ్చు. బాదంపప్పులో విటమిన్ ఎ, బి, అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని పోషించి అందంగా మారుస్తాయి. దీనికోసం బాదంపప్పుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బాదం ఉపయోగం:

బాదంపప్పును ఉపయోగించడం ద్వారా ముఖం మీద ఉన్న ముడతలు, మొటిమలు, మచ్చలను తొలగించవచ్చు. బాదంపప్పును ముఖానికి చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. ముందుగా రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకుని మృదువుగా మసాజ్ చేయాలి. బాదం నూనెలో కొద్దిగా రోజ్ వాటర్ కలపవచ్చు. ఉదయం నిద్రలేచిన తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. దీంతో మరికొద్ది రోజుల్లో ఎఫెక్ట్ కనిపిస్తుంది.

బాదం ముద్ద:

బాదంపప్పును గ్రైండ్ చేసి.. మెత్తగా పొడిగా చేయాలి. ఈ పొడికి పాలు, రోజ్‌వాటర్ జోడించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేసి.. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మాత్రమే కాదు.. బాదంపప్పులను తినవచ్చు. మూడు నుంచి నాలుగు బాదంలను రాత్రిపూట పాలలో నానబెట్టాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే పాలలో బాదంపప్పు తీసి తిని పాలు తాగవచ్చు.

బాదం పాలు:

బాదం పాలు చేసి తాగవచ్చు. దీనికోసం బాదంపప్పును మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆపై పాలలో వేసి గ్యాస్ మీద మరిగించాలి. బాదం, పెరుగుతో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బాదంపప్పును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు దానిని గ్రైండ్ చేసి, పెరుగులో కలిపి శుభ్రమైన ముఖానికి అప్లై చేయాలి. తర్వాత 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవచ్చు.

బాదం-ఓట్స్ ఫేస్‌ప్యాక్:

చర్మం పొడిగా, గరుకుగా ఉన్నట్లయితే.. బాదం- ఓట్స్‌తో చేసిన ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయవచ్చు. దీన్ని చేయడానికి.. బాదంపప్పును రాత్రంతా ఉంచాలి. నానబెట్టిన బాదంపప్పులను గ్రైండ్ చేసి సన్నని పేస్ట్‌లా చేసి అందులో పాలు, రుబ్బిన ఓట్స్ వేసి ఫేస్‌మాస్క్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్‌ని ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేసి తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది, డెడ్ స్కిన్ తొలగిపోతుంది. బాదంపప్పును ఉపయోగించే ముందు.. ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే కొంతమందికి అలెర్జీ రావచ్చు. ఇది జరిగితే.. బాదం వాడటం మానేసి వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పాలు లేదా గుడ్డు… ఫిట్‌గా ఉండటానికి రహస్యం ఏది? ఏది ఎక్కువ మంచిదో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు