Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు రూ.20 లక్షల ఆర్థిక సాయం!

విదేశీ యూనివర్సిటీల్లో చదవాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ‘మహాత్మ జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం‘ కింద ఆర్థిక సాయం పొందాలనుకునేవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 వరకూ అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి.

New Update
Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు రూ.20 లక్షల ఆర్థిక సాయం!

BC Overseas Vidya Nidhi scholarship: ఉన్నత చదువులు అభ్యసించేందుకు విదేశాలు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. కొంతకాలంగా బీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే మరోసారి మహాత్మ జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం పొందాలనుకునేవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

బీసీ, ఈబీసీ వారికి..
ఈ మేరకు విదేశీ యూనివర్సిటీల్లో చదవాలనుకుంటున్న బీసీ, ఈబీసీ స్టూండెంట్స్ మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 వరకూ దీనికి అప్లై చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. అలాగే గ్రాడ్యూయేషన్ లో 60శాతం మార్కులతో పాలు జీఆర్ఈ, జీఎమ్ఏటీ మార్కులను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇక ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులు గరిష్టంగా రూ. 20 లక్షల వరకూ ఆర్థిక సాయం పొందనున్నారు. కుటుంబంలో ఒక్కరికే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: AP: మున్సిపల్ కార్మికులకు గుడ్ న్యూస్.. భారీగా వేతనాలపెంపు!

అర్హతలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35ఏళ్లు దాటకూడదు. కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షలకు మించరాదు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ప్యూర్‌ సైన్స్‌, అగ్రికల్చర్‌ సైన్స్‌, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్‌ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించిన వారు విదేశీ విద్యానిధి ద్వారా సాయం పొందడానికి అర్హులుగా పేర్కొన్నారు.

విదేశీ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం ఐ 20 ఇన్విటేషన్‌ ఉన్నవారు, వీసాలు వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలి. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో ఉన్నత విద్యకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి. telanganaepass.cgg.gov.in/

Advertisment
Advertisment
తాజా కథనాలు