రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు

తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణం కోసం డిసెంబర్ 28నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి ఫేజ్ లో సొంత జాగ ఉన్నవాళ్లకు రూ.5 లక్షలు ఇవ్వబోతుంది.

రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు
New Update

INDIRAMMA ILLU : తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ రాబోతుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు హామీలు నేరవేర్చిన రేవంత్ సర్కార్ మరో నాలుగింటిపై కసరత్తులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రేషన్ కొత్త కార్డులతోపాటు ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అర్హులైన పేదలను గుర్తించి ఈ పథకం అందజేసేందుకు సిద్ధమవుతోంది.

ఈ మేరకు లబ్ది దారులకు ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిన ప్రభుత్వం డిసెంబర్ 28నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక చేయాలని, 2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఫస్ట్‌ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు ఇంటి నిర్మాణం కోసం నిధులు సమకూరుస్తామని, లబ్ది దారు కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు రేవంత్‌ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఇక సెకండ్ ఫేజ్‌లో సొంత స్థలం లేని వారికి ఇళ్ల పట్టాలు కేటాయించిన తర్వాతే ఇంటి నిర్మాణం కోసం నిధుల మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఇళ్ల డిజైన్‌ విషయంలో ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోగా ఇప్పటివరకూ 3 డిజైన్లను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇది కూడా చదవండి : ఆస్పత్రిలో కనీస అవసరాలే లేవు.. సీఎం మాత్రం గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడు: జగదీష్ విమర్శలు

గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇటీవల మాట్లాడుతూ.. ఈసారి ఇళ్ల నిర్మాణం కొత్తగా ఉండబోతున్నట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు కాకుండా ఈసారి బాత్ రూమ్ తదితర ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన కుటుంబాల కోసం కూడా ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామని, ఇళ్ల నిర్మాణం కోసం అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించబోతున్నట్లు తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఏర్పడిన గందరగోళం ఇందులో జరగదని, పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబాసుపాలుకాదన్నారు. డబుల్ బెడ్ రూమ్ తో పాటు బాత్ రూమ్ ఉండేలా డిజైన్ ప్లాన్ చేస్తున్నామని, ఇది పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

#december-28 #indiramma-houses #applications
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe