Apple iPhone: యాపిల్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్..ఐఫోన్‌-15 లాంచ్‌ డేట్‌, టైమ్‌ తెలిసిపోయిందోచ్!

యాపిల్ తన రానున్న గ్లోబల్ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్‌ని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 12న భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు షెడ్యూల్ చేస్తున్నారు. “వండర్లస్ట్” అని పిలవబడే ఈవెంట్.. యాపిల్ పార్క్ క్యాంపస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.ఐఫోన్‌తో పాటు ఈ ఈవెంట్‌లోనే వాచ్-9 సిరీస్‌ను అలాగే వాచ్ అల్ట్రా-2ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Apple iPhone: యాపిల్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్..ఐఫోన్‌-15 లాంచ్‌ డేట్‌, టైమ్‌ తెలిసిపోయిందోచ్!
New Update

Apple iPhone 15 launch event announced: ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ప్రొడక్ట్స్‌కి ఉండే క్రేజ్‌ అంతాఇంతా కాదు. యాపిల్‌ గ్యాడ్జెట్స్‌లో ఏది రిలీజ్ అవుతున్నా దానికి ముందునుంచే హైప్ ఉంటుంది. కేవలం కొనుగోలు చేసేవారే కాకుండా ఇతరులు కూడా యాపిల్‌ ప్రొడక్ట్స్‌పై ఆసక్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా ఐఫోన్‌ లాంచ్‌ టైమ్‌లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఐఫోన్‌-15(iPhone 15) రిలీజ్‌ డేట్ గురించి ఎలాంటి వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్‌ ఐపోతుంటుంది. ఐఫోన్‌-15 రిలీజ్‌ డేట్‌ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది గుడ్‌న్యూస్‌. లాండ్‌ డేట్‌, టైమ్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది.

లాంచ్‌ డేట్ ఎప్పుడు?
యాపిల్ ఐఫోన్-15 లాంచ్ ఈవెంట్‌ను ప్రకటించింది. నెక్ట్స్‌ జనరేషన్‌ (iPhone 15)ఐఫోన్‌ని సెప్టెంబర్ 12న లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 30నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది ఐఫోన్‌లు అనేక ప్రాంతాలలో పెద్ద అప్‌గ్రేడ్‌లను పొందుతాయని విస్తృతంగా పుకార్లు వచ్చాయి. అయితే డిజైన్‌లో పెద్దగా మార్పు ఉండదని సమాచారం. లీక్‌ల ప్రకారం యాపిల్ ఐఫోన్-15 ప్రో మోడళ్ల ధరను మాత్రం పెద్ద మార్జిన్‌తో పెంచే ఆలోచనలో ఉంది. స్టాండర్డ్, ప్లస్ వెర్షన్‌లు పాత ధరలకే అందుబాటులో ఉండవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక అన్ని మోడల్‌లు USB-C ఛార్జ్‌ని కలిగి ఉంటాయి. వినియోగదారులు అన్ని మోడళ్లలో సన్నని బెజెల్స్‌తో పెద్ద స్క్రీన్‌లను కూడా చూసే ఛాన్స్‌ ఉంది. ఐఫోన్-15 , ఐఫోన్ 15 ప్లస్ "డైనమిక్ ఐలాండ్" ఫీచర్‌ను పొందుతాయని నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ సొగసైన టైటానియం ఎండింగ్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా.. ఐఫోన్‌-15 ప్రో మ్యాక్స్.. దాని ఫొటోగ్రఫీ గేమ్‌ను పెరిస్కోప్ లెన్స్‌తో జోడించారట. మెరుగైన జూమ్ సామర్థ్యాలను అందిస్తుందని టాక్‌. మ్యూట్ స్విచ్ బటన్ స్థానంలో ప్రో మోడల్స్‌లో కొత్త యాక్షన్ బటన్‌ను కూడా చూడవచ్చు.

కేవలం ఐఫోనే కాదు.. మిగిలినవి కూడా:
రానున్న యాపిల్ ఈవెంట్‌లో.. కేవలం ‌ఫోన్‌ మాత్రమే కాకుండా ఇతర గ్యాడ్జెట్లును కూడా ప్రకటిస్తారని భావిస్తున్నారు. టెక్ దిగ్గజం యాపిల్‌ వాచ్‌ సిరీస్‌-9( Apple Watch Series9) కొత్త సెట్‌ను ఆవిష్కరించనుందని బజ్‌. యాపిల్ అల్ట్రా వాచ్‌(Apple Watch Ultra) కొత్త ఎడిషన్‌ను కూడా చూడవచ్చు. ఊహించిన ఫీచర్లలో S9 ప్రాసెసర్‌కి అప్‌గ్రేడ్ ఉంది.

ALSO READ: మోటో నుంచి మరో బడ్జెట్ మొబైల్.. ఫీచర్లు, స్పెషిఫికేషన్లు తెలుసుకోవాల్సిందే భయ్యా!

#apple-event-2023 #apple-iphone-15-series
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి