Lokesh: నారా లోకేష్ ఫోన్ హ్యాక్!.. ఈసీకి ఫిర్యాదు

AP: లోకేష్‌కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్‌ పంపింది. లోకేష్ ఫోన్‌కు ట్యాపింగ్‌, హ్యాకింగ్‌ ప్రయత్నం జరుగుతుందని ఈ మెయిల్ పంపింది. ట్యాపింగ్‌, హ్యాకింగ్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. లోకేష్ ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తోంది వైసీపీ ప్రభుత్వమే అని ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు.

New Update
Lokesh: నారా లోకేష్ ఫోన్ హ్యాక్!.. ఈసీకి ఫిర్యాదు

TDP Leader Lokesh: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీకి వ్యాపించింది. ఎన్నికల సమయంలో టీడీపీ నేత లోకేష్‌కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్‌ పంపింది. లోకేష్ ఫోన్‌కు ట్యాపింగ్‌, హ్యాకింగ్‌ ప్రయత్నం జరుగుతుందని యాపిల్‌ నుంచి లోకేష్‌కు ఈ మెయిల్ పంపింది. ట్యాపింగ్‌, హ్యాకింగ్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్ కు సూచనలు చేసింది. అయితే.. ఎన్నికల్లో ఓటమి చెందుతామనే భయంతోనే వైసీపీ ప్రభుత్వం లోకేష్ ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందని ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. మరి నిజంగానే లోకేష్ ఫోన్ హ్యాక్ అయిందా? లేదా లోకేష్ మాట్లాడే కాల్స్ రహస్యంగా ఎవరైనా వింటున్నారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

publive-image

లోకేష్ ఫోన్ హ్యాక్.. ఈసీకి ఫిర్యాదు

లోకేష్ ఫోన్‌ ట్యాపింగ్‌పై ఈసీకి ఫిర్యాదు చేశారు కనకమేడల రవీంద్రకుమార్‌. డీజీపీ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌.. ఎన్డీఏ నేతలను లక్ష్యంగా చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు పోలీసులు అనధికారికంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారని అన్నారు. మార్చిలోనూ లోకేష్ కు ఫోన్‌ ట్యాపింగ్‌ సందేశాలు వచ్చాయని పేర్కొన్నారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో డీజీపీ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేశారు కనకమేడల.

Advertisment
Advertisment
తాజా కథనాలు