ఖతార్‌ లో నేవీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ చేసిన భారత్‌!

ఖతార్‌ లో మరణి శిక్ష పడిన 8 మంది నేవీ మాజీ అధికారుల శిక్ష గురించి సవాల్‌ చేస్తూ అప్పీల్‌ దాఖలు చేసినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

ఖతార్‌ లో నేవీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ చేసిన భారత్‌!
New Update

గూఢచర్య ఆరోపణలతో కొంత కాలం క్రితం అరెస్ట్‌ అయ్యి ఖతార్‌ (Quatar)  జైలులో మగ్గిపోతున్న 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు మరణి శిక్ష విధిస్తూ ఖతార్‌ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ 8 మంది మాజీ ఉద్యోగులు కూడా భారత్‌ నేవీలో పని చేసినవారే. వారు ఖతార్‌ లో ఓ ప్రైవేట్‌ భద్రతా సంస్థలో పని చేస్తున్నారు.ఈ 8 మంది కూడా గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తమ దేశ రహస్యాలను ఇజ్రాయెల్‌ కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో అక్కడి అధికారులు వారిని అరెస్ట్‌ చేశారు. కొన్ని నెలలుగా వారి పై విచారణ జరిపింది. కొద్ది రోజుల కిందట ఖతార్‌ కోర్టు వారికి ఉరిశిక్షను అమలు చేస్తూ తీర్పుని వెలువరించింది. అయితే భారత్‌ కు చెందిన ఆ 8 మంది నేవీ మాజీ అధికారులకు పడిన మరణశిక్ష కేసులో తీర్పు గురించి ఇటీవలే అప్పీలు దాఖలు అయినట్లు భారత విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది.

అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదని అధికారులు వెల్లడించారు. ఈ తీర్పు అనేది చాలా కంప్లీకేటేడ్‌ కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలను కేవలం న్యాయ బృందంతోనే చర్చించే వీలు ఉన్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ కేసులో ప్రస్తుతం అప్పీల్‌ చేశామని..దీనికి సంబంధించిన తదుపరి చట్టపరమైన మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అధికారులు వివరించారు.

మరణ శిక్ష పడి జైలులో ఉన్న 8 మంది మాజీ అధికారులను కూడా కలిసేందుకు ఖతార్‌ రాజధాని దోహాలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి మరో అవకాశం లభించిందని భారత విదేశాంగ అధికారి అరిందమ్‌ బాగ్చి తెలిపారు. ఈ మంగళవారం భారత రాయబార అధికారులు వారిని కలుసుకోనున్నట్లు చెప్పారు. వారికి అవసరమైన న్యాయపరమైన, దౌత్యపరమైన పూర్తి సహకారాన్ని కూడా భారత ప్రభుత్వం అందిస్తుందని తెలిపింది.

మరణ శిక్ష పడిన 8 మంది అధికారుల కుటుంబ సభ్యులతో భారత ప్రభుత్వం ఇప్పటికే మాట్లాడిందని ఆయన వివరించారు. ఇటీవలే విదేశాంగ్ మంత్రి జై శంకర్‌ కూడా బాధిత కుటుంబ సభ్యుతలతో భేటీ అయ్యారని బాగ్చి వెల్లడించారు. గత సంవత్సర కాలంగా గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీకి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. శిక్ష పడిన అధికారుల్లో కొందరూ యుద్ద నౌకల్లో మేజర్ గా వ్యవహరించిన వారు ఉన్నారు.

వీళ్లు సంవత్సరం నుంచి ఖతార్‌ లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఖతార్‌ వెల్లడించిన ఈ ఉరి శిక్ష పై లీగల్‌ పరంగా చర్యలు తీసుకుంటామని భారత్‌ ప్రకటించింది. ” నేవీ మాజీ అధికారులకు ఉరి శిక్ష వేయడం అనేది షాకింగ్‌ విషయం. దీనికి సంబంధించిన పూర్తి తీర్పు కోసం భారత ప్రభుత్వం ఎదురు చూస్తుంది.

అధికారుల కుటుంబాలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్లు భారత దౌత్యాధికారులు ప్రకటించారు. న్యాయపరమైన అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వారు వివరించారు. ఈ తీర్పుని మేము సవాల్‌ చేస్తున్నట్లు భారత అధికారులు ప్రకటించారు. అధికారులను విడిపించడం కోసం ఇప్పటికే అనేక సార్లు బెయిల్ దరఖాస్తు చేశాం.

కానీ వాటిని ఖతార్‌ అధికారులు తిరస్కరించారు. అంతే కాకుండా అధికారులు జైలు శిక్షను పెంచుతూ వచ్చారు. చివరికి ఇలా ఉరి శిక్షను విధించినట్లు సంచలన తీర్పుని ఇచ్చింది. గతేడాది ఆగస్టులో ఖతార్‌ పోలీసులు 8 మంది ఇండియన్‌ నేవీ మాజీ అధికారుల్ని అరెస్ట్‌ చేశారు.

వీరంతా కూడా ఇజ్రాయేల్‌ కి గూఢచారులుగా వ్యవహరిస్తున్న అనుమానంతో అదుపులోకి తీసుకుంది. ఖతార్ లో ఓ కంపెనీలో పని చేస్తూనే ఇలా గూఢచారులుగా చేస్తున్నారని ఆరోపించింది. అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు ఈ 8 మంది సిబ్బంది కూడా. మరణ శిక్ష ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్లు నవతేజ్‌ సింగ్‌ గిల్‌, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ వశిష్ఠ, కమాండర్లు అమిత్‌ నాగ్‌పాల్‌, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్ ఉన్నారు. వీరిపై గతేడాది ఆగస్టులో ఖతార్ అభియోగాలు మోపింది.

Also read: బీభత్సం సృష్టించిన కారు..ముగ్గురు మృతి..పదుల సంఖ్యలో క్షతగాత్రులు!

Also read: తిరుపతి శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక!

#national #quatar #navy-officers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe