AP News: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమోషన్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలనే వారి విజ్ఞప్తిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు. ప్రజా ప్రభుత్వంలో అందరి సమస్యలు తీరుస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

AP News: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమోషన్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!
New Update

Nara Lokesh: మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలంటూ విజయవాడకు చెందిన ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, సమస్యల పరిష్కారానికి ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ప్రారంభించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభిస్తుందని అన్నారు.

ఆర్ఎంపీ బోర్డు ఏర్పాటు..
అలాగే ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ సభ్యులు కోరారు. అంతేకాదు అర్హత పత్రాలు మంజూరు చేసి, ఆర్ఎంపీ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ అంశానికి సంబంధించి అధికారులతో చర్చించి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్‌ భరోసా ఇచ్చారు.

ఇక జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. నాడు పరదాల ప్రభుత్వంలో అన్యాయం జరిగిన వారికి ప్రజా ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారని విమర్శలు గుప్పించారు. ఇక 14వ రోజు ప్రజాదర్బార్‌కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారని అన్నారు.

Also Read: రూ.500, 200 నోట్ల రద్దు.. హింట్ ఇచ్చేసిన చంద్రబాబు!

#nara-lokesh #apgs-ws
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe