posani krishna murali on chandrababu, lokesh: చంద్రబాబు, పవన్‌పై APFDC ఛైర్మన్ పోసాని కృష్ణ మురళిపై ఫైర్ అయ్యారు. లోకేశ్ ఎవరిపైనా విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. లోకేశ్ తనపై రూ.4కోట్లు పరువునష్టం దావా వేశారని గుర్తుచేశారు. సీఎంపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన లోకేశ్‌పై పరువు నష్టం దావా వేయకూడదా అని ప్రశ్నించారు. లోకేశ్‌పై పరువు నష్టం దావా వేస్తే కనీసం 20ఏళ్లు ఉంటారన్నారు. తనపై హత్యకు కుట్ర చేశారని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. తనపై మీద కేస్ పెట్టింది చంపడానికేనన్నారు. కోర్టుకి వస్తే తనను చంపాలని చూస్తున్నారని.. తాను చనిపోతే దానికి కారణం చంద్రబాబు కొడుకు నారా లోకేశేనన్నారు.
పోసాని ఏం అన్నారంటే?
➡ లోకేష్ నా మీద పరువు నష్టం కేసు పెట్టాడు.. 20కోట్లు కొట్టాలంటా...20ఏళ్ల జైలు శిక్ష అంటున్నాడు..
➡ నారా లోకేష్ ఆత్మభిమానం కలిగిన వాడు.. సంస్కారం కలిగిన వాడు...
➡ రోడ్డు మీద చీమకి కూడా హాని తలపెట్టడు...
➡ అలాంటి నారా లోకేష్ పచ్చి బూతులు మాట్లాడతాడు..
➡ దళితుల మీద ఇస్టాను నుసారంగా మాట్లాడాడు..
➡ అలాంటి లోకేష్ మీద ఎన్ని కేసులు పెట్టాలి.. ఎన్ని సంవత్సరాలు జైలులో పెట్టాలి?..
➡ పార్టీలో రమ్మని నన్ను ఆహ్వానించారు.. నేను రాలేను అని చెప్పా..
➡ అమ్మాయిలతో తిరుగుతూ జల్సాలు చేసిన నారా లోకేష్ నా మీద కేసు పెట్టాడు..
➡ కంతేరు లో లోకేష్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారు..
➡ చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తులు లోకేష్ వి కాదా?..
➡ బ్రాహ్మణి పేరు మీద ఆస్తులు కొనలేదా?...
➡ తన పేరు మీద ఆస్తులు లేవని లోకేష్ కాకమ్మ కథలు చెబుతున్నారు..
➡ పెదకాకాని లో నాకు పొలాలు లేవు...
➡ నా కష్టంతో రెండు ఇళ్ళు కొనుక్కోన్నా...నందిగామ లో 5 ఎకరాల పొలం కొన్నా..
➡ డబ్బులు లేక నా తండ్రి ఆత్మహత్య చేసున్నాడు..
➡ అమరావతి రైతులకు నా ఛాలెంజ్.
➡ నా పేరు మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆస్తులు మొత్తం ఇచ్చేస్తా..
➡ రైతులు ఒక్క సేంట్ భూమి ఇస్తారా? ద మ్ముందా..
➡ కులం కోసం ఎందుకు చంద్రబాబు జపం చ్చేస్తున్నారు..
➡ నా మీద కేస్ పెట్టింది... నన్ను చంపడానికే..
➡ కోర్ట్ కి వస్తే నన్ను చంపాలని చూస్తున్నారు..
➡ నేను చనిపోతే దానికి కారణం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కారణం... ఏపీ ప్రజలు అందరూ గుర్తు పెట్టుకోండి..
➡ లోకేష్ మీద తిరిగి కేస్ పెట్టబోతున్నా..