Aparichithudu : 19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న 'అపరిచితుడు'.. ఏకంగా అన్ని వందల థియేటర్స్ లో?

'అపరిచితుడు' మూవీ థియేటర్స్ లో విడుదలైన 19 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ కాబోతోంది. 'అపరిచితుడు' 4K వెర్షన్ ని మే 17 న రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా సుమారు 700 థియేటర్స్ లో ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

Aparichithudu : 19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న 'అపరిచితుడు'.. ఏకంగా అన్ని వందల థియేటర్స్ లో?
New Update

Aparichithudu Re- Release :  టాలీవుడ్ లో గత కొంత కాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ పేరుతో మళ్ళీ థియేటర్స్ విడుదల చేస్తున్నారు. అది కూడా 4k వెర్షన్ తో రిలీజ్ చేస్తుడంటంతో ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఈ రీ రిలీజ్ సినిమాలను థియేటర్స్ లో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ మధ్య కాస్త స్లో అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది. కొన్ని రోజులుగా థియేటర్స్ లో కొత్త సినిమాలు సరిగా ఆడకపోయేసరికి ఒకప్పటి హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో చియాన్ విక్రమ్ 'అపరిచితుడు' కూడా చేరిపోయింది.

Also Read : రణ్ వీర్ సింగ్ – ప్రశాంత్ వర్మ కాంబో మూవీకి అదిరిపోయే టైటిల్!

19 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో అపరిచితుడు ముందు వరుసలో ఉంటుంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో విక్రమ్ తన నట విశ్వరూపం చూపించాడు.

ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలను అరికడుతూ నరకంలో వేసే శిక్షలు తప్పు చేసిన వాళ్లపై అమలు చేసే అపరిచితుడి పాత్రలో అదరగొట్టేసాడు. సదా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 2005 లో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.

అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్స్ లో విడుదలైన 19 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ కాబోతోంది. 'అపరిచితుడు' 4K వెర్షన్ ని మే 17 న రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా సుమారు 700 థియేటర్స్ లో ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీ రీ రిలీజ్ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

publive-image

#aparichithudu-re-release #chiyaan-vikram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe