/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
Rains In AP : ఏపీ(Andhra Pradesh)లో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం కూడా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీలోని కృష్ణా, పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, విశాఖ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్నిచోట్ల పిడుగులు(Thunderbolts) కూడా పడే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.
అదే సమయంలో సత్యసాయి, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
అంతేకాకుండా శనివారం రాష్ట్రంలో పలు చోట్ల నమోదైన వర్షపాతం వివరాలను కూడా వెల్లడించింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 28.2 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా పుత్తూరులో 27.2, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 14 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు వివరించింది.
Also read: పద్మవ్యూహంలో బలవ్వడానికి అభిమాన్యుడిని కాదు..అర్జునుడిని!