AP TET RESULT: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చూసుకోండి

ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్‌ ఎగ్జామ్ రిజల్ట్స్‌ను విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం రిలీజ్ చేశారు. 2.35లక్షల మంది టెట్ పరీక్ష రాశారు. వెబ్ సైట్.. https://aptet.apcfss.in/CandidateLogin.do

AP TET RESULT: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చూసుకోండి
New Update

AP TET: ఏపీ టెట్ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్‌ ఎగ్జామ్ కు 2.35లక్షల మంది హాజరవగా.. మంగళవారం ఇందుకు సంబధించిన రిజల్ట్స్ రిలీజ్ చేశారు.  రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి. https://aptet.apcfss.in/CandidateLogin.do

ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదాపడిన విషయం తెలసిందే. కాగా టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు. డీఎస్సీలోనూ టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు. మరోవైపు జూలై1న మెగా డిఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే మెగా డిఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేయడంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. 16వేల డీఎస్సీ పోస్టులను ఈ ఏడాది డిసెంబర్ కల్లా రిక్రూట్ చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టుకోవడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.

ఇదిలా ఉంటే.. మెగా డిఎస్సీకి నోటిఫికేషన్‌ కు ముందు మరో టెట్ ఉంటుందో లేదోననే విషయంపై క్లారిటీ రావాల్సివుంది. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇవ్వనున్నారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

#results #ap-tet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe