AP Politics: నా సీటు జనసేనకు ఇవ్వండి.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వాఖ్యలు

ఈనెలలోనే టీడీపీ, జనసేన సమన్వయకమిటీ సమావేశం
New Update

టీడీపీ - జనసేన పొత్తుపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (TDP Leader Ayyanna Patrudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక కల్యాణం కోసం అవసరం అయితే తన సీటు కూడా జనసేనకు ఇవ్వాలని చంద్రబాబుకు (Chandrababu Naidu) సూచించినట్లు చెప్పారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే తాను అనేక సార్లు ఎమ్మెల్యేగా పని చేశానన్నారు. తనకు పదవులపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ను (AP CM Jagan) గద్దె దించడమే తన లక్ష్యమన్నారు. ఇందుకోసం తాను ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమని అయ్యన్న స్పష్టం చేశారు. పోలీసులు తాము తినే ప్రతీ పైసా.. ప్రజల సొమ్ము అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జైలుకు వెళ్లడానికి తాను కూడా నేను సిద్ధమని స్పష్టం చేశారు. అందరి బలం కూడగట్టి ఈ దుర్మార్గుడిని రాజకీయ సమాధి చేయాలని సీఎం జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు అయ్యన్న. ఇంకా నారా చంద్రబాబును అరెస్ట్ చేసినట్లే లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. లోకేష్ ను అరెస్ట్ చేస్తే బ్రాహ్మణి నాయకత్వంలో పార్టీ నడుస్తుందన్నారు.

ఇదిలా ఉంటే.. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడిని చంపేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరాధారమైన ఆరోపణలో అరెస్ట్ చేయించి, జైల్లోనే అంతమొందించే కుట్రలు చేస్తున్నారని, తాజా పరిణామాలు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేష్.. ‘సైకో జగన్.. చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. చంద్రబాబుకి జైలులో భద్రత లేదు. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని సైకో జగన్ కుతంత్రాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్‌ దే బాధ్యత’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

#tdp-leader-ayyanna-patrudu #janasena #tdp-janasena-alliance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి