SSC : ఏపీ(Andhra Pradesh) పదో తరగతి ఫలితాలు(Tenth Class Results) మరికాసేపట్లో విడుదల కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన వాల్యుయేషన్, కోడింగ్, డీ కోడింగ్, కంప్యూటరీకరణ అన్ని పూర్తవ్వడంతో అధికారులు ఫలితాలను ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. పదో తరగతి పరీక్షలు(Tenth Class Exams) రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18 నుంచి 30 వరకు జరిగాయి.
ఈ పరీక్షలకు సమారు 6 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలికలు 3,05,153 మంది ఉండగా... బాలురు 3,17,939 మంది ఉన్నారు. ఫలితాలను వెల్లడించిన తరువాత విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.దీంతో పాటు పదో తరగతి మార్కుల మెమోను స్టూడెంట్స్ చెక్ చేసి, డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల సంఘం(Election Commission) అనుమతి లభించడంతో ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. https://bse.ap.gov.in/ ఈ లింక్ లో పదో తరగతి ఫలితాలను చూడవచ్చు.
Also read: ఇక నుంచి నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్‌డీ!