ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులోప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తనను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని ఆయన తరపున దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. వాటిని తిరస్కరించింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులోప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తనను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని ఆయన తరపున దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. వాటిని తిరస్కరించింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. హౌస్ కస్టడీ విషయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించినా.. ఏసీబీ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
Chandrababu quash petition copy
రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడును హౌస్ రిమాండ్‌లో ఉంచేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హిమబిందు తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ఆదివారం రాత్రి పిటిషన్ దాఖలు చేయగా, సోమవారం వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను న్యాయమూర్తి పరిశీలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ ఇంటి కంటే సురక్షితమైన ప్రదేశమని, జైలులోని స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడికే కేటాయించారని ఆయన తన వాదనల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి హౌస్ రిమాండ్ పిటిషన్‌ని తిరస్కరించారు.
ఆరోపణలకు చెక్ పెట్టేలా ప్లాన్:
మరోవైపు ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మోదీ అండతో జగన్ లక్షల కోట్ల అవినీతి చేస్తున్నారని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. దీనికి బదులుగానే బాబును జైలుకు పంపించారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఒకపక్క తను స్వయంగా అవినీతి కేసులు ఎదుర్కొంటూ, కోర్టులు చుట్టూ తిరుగుతున్న జగన్.. బాబు అవినీతిపై చేసే విమర్శలకు బలం ఉండాలంటే ఆయనను కూడా జైల్లో పెట్టక తప్పని అనివార్య పరిస్థితి నెలకొంది.
Also read: ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు? పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వం..!