Skill Development Case: చంద్రబాబుకు షాక్‌.. దసరా ముగిసేవరకు జైల్లోనే..!

హైకోర్టులో చంద్రబాబుకు షాక్‌ తగిలింది. తనకు బెయిల్ కావాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసంది. దసర సెలవుల తర్వాత కోర్టు విచారించనుండగా.. అప్పటివరకు చంద్రబాబు జైల్లోనే ఉండాలి. ఆ తర్వాత విచారణలోనైనా చంద్రబాబుకు బెయిల్ రావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

New Update
Breaking: చంద్రబాబు బెయిల్ పై విచారణ.. నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి

Chandrababu Skill Development Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. దసరా సెలవుల తర్వాత విచారణ చేస్తామని చెప్పింది. దీంతో దసర సెలవులు ముగిసేవరకు చంద్రబాబు జైల్లోనే ఉండనున్నారు. అటు చంద్రబాబు బెయిల్ పిటిషన్, ఐఏ అప్లికేషన్‌ వెకేషన్ బెంచ్‌కు పోస్ట్ చేయాల్సిందిగా చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దీనికి హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను వెకేషన్ బెంచ్‌కు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్ తో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చింది హైకోర్టు.

కస్టడి పొడిగింపు:
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. ఏసీబీ కోర్టుతో (ACB Court) పాటు ఏపీ హైకోర్టు (AP High Court), సుప్రీంకోర్టులో చంద్రబాబునాయుడు తరుఫు లాయర్లు పలు పిటీషన్లు వేశారు. చంద్రబాబు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటికి పలుమార్లు చంద్రబాబు రిమాండ్‌ని పొడిగిస్తూ వచ్చిన ఏసీబీ కోర్టు మరోసారి అదే చేసింది. నిజానికి ఇవాళ్టితో చంద్రబాబు రిమాండ్‌ ముగియల్సి ఉంది. కానీ ఏసీబీ కోర్టు మరోసారి చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించింది. నవంబర్‌ 1 వరకు రిమాండ్‌ను పొడిగించింది కోర్టు.

Also Read:  యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ఘనత..ఫుల్‌ జోష్‌ లో ఫ్యాన్స్..!!

మరోవైపు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు (Inner Ring Road Case) లోనూ  నిన్న విచారణను వాయిదా వేసింది హైకోర్టు. ఇప్పటికే ఇన్నర్ రింగ్ కేసులో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ మార్చడం ద్వారా చంద్రబాబు కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని‌ రమేష్ లకు లబ్ది చేకూర్చారని కౌంటర్ లో పేర్కొంది సీఐడీ. అటు ఫైబర్ నెట్ కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు మొన్న(మంగళవారం) వాయిదా వేసింది. శుక్రవారం(రేపు) నాడు ఈ పిటిషన్ పై విచారణ జరపనున్నట్లు తెలిపింది. ఆ రోజు కేసుల జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన పై విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపిస్తున్నారు. ఇక రేపటి సుప్రీం కోర్టు లో ఆరో బెంచ్ లో 9వ కేసుగా లిస్టు అయిన చంద్రబాబు నాయుడు గారి ఫైబర్ నెట్ బెయిల్ పిటీషన్

Also Read: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు..

Advertisment
తాజా కథనాలు