Skill Development Case Update: ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ13గా ఉన్న చంద్రకాంత్ షా అప్రూవర్ గా మారారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రకాంత్ షా మొబైల్ ఫోన్, డాక్యుమెంట్స్, ల్యాప్ టాప్స్ ఏసీబీ కోర్టుకు సమర్పించారు ఏపీ సీఐడీ అధికారులు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ లో సైంటిఫిక్ ఎనాలసిస్ తర్వాత చంద్రకాంత్ షా ను ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు. తాను అప్రూవర్ గా మారుతున్నట్లు ఏసీబీ కోర్టుకు ఆయన తెలిపారు. చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.
Also Read: సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
డాక్యుమెంట్స్ అడిగిన న్యాయవాదులు..
అప్రూవర్ గా మారిన నిందితుడు చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో.. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగారు చంద్రబాబు నాయుడు (Chandrababu) తరపు న్యాయవాదులు. కోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 18కు వాయిదా వేసింది.
Also Read: డీఎండీకే అధినేత విజయకాంత్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో సూర్య.!(వీడియో)
కాగా, రాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు కలకలం సృష్టించింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చంద్రబాబు తప్పు చేయకపోయినా కావాలనే ఆయనను అరెస్ట్ చేశారని నిరసనలు చేశారు. దాదాపు 52 రోజుల తరువాత జైలు నుండి బెయిల్ పై చంద్రబాబు విడుదల అయ్యారు.